తెలంగాణా రాష్ట్రంలో వైద్యు నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వచ్చిన పలువురు మహిళలకు వైద్యులు మత్తుమందిచ్చి వదిలేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,
రాష్ట్రంలోని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తుర్కపల్లి, రాజపేట మండలాలకు చెందిన మహిళలను ఆశా వర్కర్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. మొత్తం 20కి చేరిపోయింది. వీరందరికీ మత్తిచ్చి పడుకోబెట్టారు.
మిగిలినవారికి ఆపరేషన్ చేయలేమని రేపు రావాలంటూ సూచించారు. అయితే, మిగతా మహిళలు తమకు కూడా ఇపుడే ఆపరేషన్ చేయాలంటూ పట్టుబట్టాటుర. దీంతో ఆస్పత్రి వైద్యులు అసలు ఎవరికీ ఆపరేషన్ చేసేది లేదంటూ మత్తు మందిచ్చిన మహిళలను మధ్యలోనవే వదిలివేసి వెళ్లిపోయారు. దీంతో వైద్య సిబ్బందితో కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఈ విషయం పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలేం జరిగిందంటూ ఆరా తీస్తున్నారు.