తెలంగాణలో కరోనా ఉధృతితో మూ పడ్డ విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఆదివారంతో ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ముగియనున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
కరోనా కేసుల తగ్గుదల, తీవ్రత లేకపోవడతో తిరిగి విద్యాసంస్థలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ 8, 9, 10 తరగతులకు కూడా ఆన్ లైన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నారు.