Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ సీఎం కేసీఆర్

Advertiesment
kcrao
లోక్‌సభ ఎన్నికలకు భారాస మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మెదక్‌ లోక్‌సభ స్థానానికి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నట్లు తెలిపింది. 
 
ఇప్పటికే చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్‌ - డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్‌ - అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌, కరీంనగర్‌ నుంచి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం - నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత, మహబూబ్‌నగర్‌- మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మల్కాజిగిరి - రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌ - ఆత్రం సక్కును ఆ పార్టీ ప్రకటించింది. 
 
ఇప్పటి వరకు 13 స్థానాలకు భారాస అభ్యర్థులను ఖరారు చేసింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నల్గొండ, భువనగిరి స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తలో మార్పు రాలేదు.. వేధింపులు ఆగలేదు.. గొడ్డలితో నరికేసింది..