Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మల్లారెడ్డినా మజాకా.. మనవరాలి సంగీత్‌లో డ్యాన్స్ ఇరగదీశారు..(video)

Advertiesment
Malla Reddy

సెల్వి

, మంగళవారం, 22 అక్టోబరు 2024 (16:11 IST)
Malla Reddy
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత చామకూర మల్లారెడ్డి తెలంగాణలో ప్రముఖ రాజకీయ నాయకులు. 71 ఏళ్ల అనుభవజ్ఞుడైన ఈయన తన ప్రత్యేకమైన ప్రసంగాల కారణంగా సోషల్ మీడియాలో బాగా పాపులర్. తాజాగా ఈయన తన మనవరాలి పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమంలో తన అద్భుతమైన నృత్య ప్రదర్శన చేశారు. ఈ డ్యాన్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 
 
ఈ నెల 27న మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె దీక్ష వివాహం జరగనుంది. ఆదివారం జరిగిన సంగీత కార్యక్రమంలో మల్లారెడ్డి డ్యాన్స్ అదిరిపోయింది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, సిద్ధు జొన్నలగడ్డ, ఇతర తారల పాటలకు మల్లారెడ్డి స్టెప్పులేశారు. 
 
మల్లారెడ్డి తన ప్రక్కన ఉన్న యువ నృత్యకారులకు ఏమాత్రం తగ్గకుండా ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. తన మనవళ్లతో ఎంట్రీ ఇచ్చిన మల్లారెడ్డి.. సూపర్ స్టార్ రజనీకాంత్ పాటకు ఎంట్రీ ఇచ్చి అతిథులను అలరించారు. తర్వాత, డీజే టిల్లు టైటిల్ సాంగ్‌కి స్టెప్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి పేరు పెట్టిన ఏపీ సర్కార్