Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇది నాకు మేమరబుల్ మూమెంట్.. చిరంజీవి (Video)

Advertiesment
chiranjeevi

సెల్వి

, సోమవారం, 23 సెప్టెంబరు 2024 (13:29 IST)
తన పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కడం తనకు చిరస్మరణీయమైన తీపిగుర్తు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. చిరంజీవి ఏ అంశంలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారన్నది అత్యంత ఆసక్తి కలిగించే అంశం. చిరంజీవి తన 45 ఏళ్ల కెరీర్ లో 156 సినిమాల్లో నటించి, 537 పాటల్లో 24,000 డ్యాన్స్ స్టెప్పులు వేశారు. మరే నటుడూ ఇన్ని డ్యాన్స్ స్టెప్పులు వేసిన దాఖలాలు లేవు. 
 
చిరంజీవి 1978 సెప్టెంబరు 22న తన కెరీర్ ప్రారంభించారు. భారతీయ సినీ చరిత్రలో మరే నటుడికి సాధ్యం కాని రీతిలో అత్యధిక స్టెప్పులతో గిన్నిస్ బుక్ రికార్డు నమోదు చేశారు. ఇవాళ హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధులు హాజరైన చిరంజీవికి రికార్డును అందజేశారు. చిరంజీవి బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ చేతులమీదుగా అందుకోవడం విశేషం. 
 
కాగా, ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అల్లు అరవింద్, సుస్మిత, వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. ఇందులో చిరంజీవి మాట్లాడుతూ, "మా శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వల్ల ఈ ఈవెంట్ కలర్‌ఫుల్‌గా మారిపోయింది. ఇది నాకు మేమరబుల్ మూమెంట్. నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఊహించలేదు.. ఆలోచించలేదు. నేను ఎదురుచూడనది నాకు ఈ రోజు లభించింది. దీనికి కారణమైన దర్శక నిర్మాతలకు టెక్నిషియన్స్‌కు ధన్యవాదాలు. నటనకంటే ముందు నేను డాన్స్‌కు ఓనమాలు దిద్దినట్లు అన్పిస్తొంది. 
 
నా చిన్నప్పుడు రేడియోలో పాటలకు డాన్స్ వేస్తూ ఉండేవాడిని. డాన్స్‌లను ఎనర్జిటిక్ ప్రెంజెట్ చేసెవాడిని. ఎన్‌సి‌సి‌లో ఉన్నప్పుడు కూడా డాన్స్ వెస్తూ తోటి వారిని ఎంటర్ టైన్ చెసేవాడిని. నన్ను ఎవరైనా డాన్స్ వేయమని అగడటం పాపం.. వెసేసేవాడిని. ఓసారి డాన్స్ వెస్తూ క్రింద పడ్డా.. దానిని నాగినీ డాన్స్‌గా మలచటంతో అప్లాజ్ వచ్చింది. నా డాన్స్ స్కిల్  అన్నది నాకు నటుడిగా బాగా బెనిఫిట్ అయింది. నాకంటే సీనియర్ హీరోస్ ఉన్నప్పుడు.. డిస్ట్రిబ్యూటర్స్ చిరంజీవితో సినిమా చేయమని అడిగారు. 
 
జనం నాడి తెలిసిన వారు అలా చెప్పటంతో.. నిర్మాతలు నుంచి నాకు అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత నా పాటల కోసం నిర్మాతలు దర్శకులు, సంగీత దర్శకులు ప్రత్యేకంగా దృష్టి పెట్టెవారు. అప్పట్లో పాటలకున్న ప్రత్యేకత నా జీవితంలో అంతర్బాగంగా మారి పేరు గుర్తింపు, ఈరోజు రికార్డును తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డ్ ప్రతినిధులకు ధన్యవాదాలు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హరి హర వీర మల్లు విజయవాడ షెడ్యూల్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్