Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ రికార్డు... ఎందుకో తెలుసా?

Advertiesment
chiru - gunnis

ఠాగూర్

, ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (17:42 IST)
తెలుగు అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి విశిష్ట గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆయనకు పద్మ విభూషణ అవార్డు వరించింది. తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో ఆలరించినందుకు గాను ఈ అవార్డును ప్రదాన చేశారు. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. 
 
కాగా, మెగాస్టార్ చిరంజీవి సుమారు 46 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో వెలుగొందుతున్నారు. ఇప్పటివరకు 155 సినిమాలు చేశారు. ఫైట్లు, యాక్షన్, డ్యాన్సులు, స్టైల్‍తో ఈ వయస్సులో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు చేరి స్ఫూర్తిగా నిలిచారు. చిరంజీవి తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో ఘనతలు, అవార్డులు దక్కించుకున్నారు.  
 
ఇప్పుడు చిరంజీవి మరో గౌరవం దక్కించుకున్నారు. మెగాస్టార్ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చేరింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‍లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్‌ సమక్షంలో చిరంజీవికి గిన్నిస్ రికార్డును, గిన్నిస్ బుక్  ప్రతినిధులు ప్రకటించారు. 150కు పైగా సినిమాల్లో వివిధ రకాలైన డ్యాన్స్‌లు చేసినందుకు చిరంజీవికి ఈ ఘనత దక్కింది. 
 
ఇతర నటులు కొందరు ఇంత కంటే ఎక్కువ చిత్రాల్లో నటించినా.. అన్ని చిత్రాల్లో అన్ని రకలా డ్యాన్స్ చేయలేదనే చెప్పవచ్చు. ఈ విషయంలోనే చిరంజీవికి గిన్నిస్ రికార్డు దక్కనుందని తెలుస్తొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'దేవర' చిత్ర నిర్మాతలకు దసరా బొనంజా.. రూ.60 టిక్కెట్ రూ.135కు పెంపు!!