Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏయన్నార్ కృషి - కీర్తి - స్పూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం : బాలకృష్ణ

Advertiesment
balakrishna

ఠాగూర్

, శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (10:31 IST)
తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన దివంగత మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణంగా ఉందని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.
 
ఏఎన్నార్ శతజయంతి వేడుకలపై ఆయన స్పందిస్తూ, మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆయన కృషి, కీర్తి, మరియు స్ఫూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా, తెలుగు సినీరంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం. 
 
నాటకరంగం నుండి చిత్రరంగం వరకు, ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ. ఈ రోజు, ఆయనకు మనమందరం నివాళి అర్పిస్తూ, ఆయన నటన, కృషి, మరియు పట్టుదలతో వెలసిన విజయాలను స్మరించుకుందాం" అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు సినిమా అప్ డేట్ అడిగితే కర్రతీసిన రాజమౌళి - డిసెంబర్ లో జర్మనీకి వెళ్ళనున్న రాజమౌళి