Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్

Advertiesment
Manchu Manoj

ఠాగూర్

, గురువారం, 19 సెప్టెంబరు 2024 (15:14 IST)
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కోలీవుడ్ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ను పోలీసులు గురువారం బెంగుళూరులో అరెస్టు చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయనను హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, జానీ మాస్టర్‌ అరెస్టుపై నటుడు మంచు మనోజ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. 
 
'జానీ మాస్టర్‌.. కెరీర్‌ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతలా శ్రమించారో అందరికీ తెలుసు. కానీ, ఈరోజు మీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది.
 
ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్‌ సిటీ పోలీస్‌, బెంగళూరు నగర పోలీస్‌లకు నా అభినందనలు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇది తెలియజేస్తుంది. జానీ మాస్టర్.. నిజాన్ని ఎదుర్కొండి. మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చేయండి. మీరు దోషి అయితే.. దానిని అంగీకరించండి' అని హితవు పలికారు.
 
అంతేకాకుడా, ఇచ్చిన మాట ప్రకారం మహిళా రక్షణ విభాగం (ఉమెన్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌)ని వెంటనే సిద్ధం చేయాలని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ను కోరుతున్నా. దానికంటూ ప్రత్యేకంగా సోషల్‌మీడియా ఖాతాలు ఏర్పాటు చేయండి. మన పరిశ్రమలోని మహిళలకు గళంగా నిలవండి. తాము ఒంటరిగా లేమని.. తమ బాధను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలబడిన మన పరిశ్రమ పెద్దలు, సహోద్యోగులకు నా మద్దతు తెలియజేస్తున్నా. న్యాయం, గౌరవం అనేది మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లోనూ చూపించే విధమైన సమాజాన్ని నిర్మిద్దాం. కుమార్తె, సోదరి, తల్లి.. ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం' అని మనోజ్‌ కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!