Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22-05-2019 బుధవారం మీ రాశిఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి...

Advertiesment
22-05-2019 బుధవారం మీ రాశిఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి...
, బుధవారం, 22 మే 2019 (08:18 IST)
మేషం : టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ఆర్ధిక విషయాలలో మీ లెక్కలు తారుమారు కాగలవు. సోదరి, సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి.
 
వృషభం : మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం కూడదు. మధ్య మధ్య ఔషధ సేవ తప్పదు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు తప్పవు. గృహంలో వాస్తుకు అనుగుణంగా మార్పులు చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.
 
మిథునం : మీ పట్టుదలవల్ల శ్రమాధిక్యత, ధననష్టం ఎదుర్కొంటారు. లీజు, నూతన కాంట్రాక్టులు, ఏజెన్సీలు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో అప్రమత్తతగా వ్యవహరించండి. బంధువుల వల్ల సమస్యలు, చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. మిత్రులను కలుసుకుంటారు.
 
కర్కాటకం : కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి అధికమవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. స్థిరాస్తి అమ్మకం వాయిదా పడటం మంచిది. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు.
 
సింహం : పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. విద్యార్థుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. రచయితలు, పత్రికా, ప్రైవేటు సంస్థల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు సమకూర్చు కుంటారు.
 
కన్య : దంపతుల మధ్య కలహాలు, చికాకులు తలెత్తుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రవాణా రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు లేకున్నా అసంతృప్తి మిమ్మల్ని వెన్నంటుతుంది. రాజకీయాలలో వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. ఖర్చులు అధికం.
 
తుల : మొండి బాకీలు సైతం వసూలుకాగలవు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలుచేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. పాత రుణాలు తీరుస్తారు.
 
వృశ్చికం : బ్యాంకింగ్ రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు అధికమవుతాయి. స్త్రీలకు విలాసాలు, ఆడంబరాల పట్ల మక్కువ పెరుగుతుంది. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం.
 
ధనస్సు : ఉపాధ్యాయులు ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలలో పూర్తి చేస్తారు. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి, పనిభారం అధికం. అయిన వారి కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
మకరం : కుటుంబంలోను, బయటా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళుకువ అవసరం. రుణాల కోసం అన్వేషిస్తారు.
 
కుంభం : స్త్రీలకు అయిన వారి నుంచి అందిన ఒక సమాచారం సందిగ్ధానికి గురి చేస్తుంది. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతారు. వస్త్ర, బంగారం వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. ఆరోగ్య, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. చేస్తున్న ఉద్యోగాన్ని తొందరపడి మానవద్దు.
 
మీనం : హాస్టళ్ళు సందర్శన, విహార యాత్రలు అనుకూలిస్తాయి. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనపడుతుంది. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ధనం బాగా వ్యయం చేసి అయిన వారిని సంతృప్తి పరుస్తారు. సంఘంలో పలుకబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి...?