Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహా మృత్యుంజయ మంత్రం విశిష్టత ఏంటో తెలుసా?

మహా మృత్యుంజయ మంత్రం విశిష్టత ఏంటో తెలుసా?
, శుక్రవారం, 14 మే 2021 (16:02 IST)
మానవుడి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహా మృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్ర దీక్షలో హోమ భస్మధారన మంత్రంగా చెప్పుకుంటారు. ఈ మంత్రం పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీరసాగర మథనంలో జనించిన హాలాహలాన్ని పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. 
 
ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ఇది ఒక విధమైన సంజీవని మంత్రం అని చెప్పుకోవచ్చు. ఆపదలు కలిగినపుడు, అనూహ్య సమస్యలు ఎదురైనప్పుడు కూడా దీనిని చదువుకోవచ్చును. ఈ మంత్రానికి సర్వ రోగాలను తగ్గించే శక్తి ఉంది. ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. 
 
"ఓం త్రయంబకం యజామహే!
సుగంధిం పుష్టి వర్ధనం!
ఉర్వారుక మివ బంధనాత్!
మృత్యోర్ ముక్షీయ మామృతాత్!"
 
తాత్పర్యం: అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించుచున్నాము. ఆయన దోస పండును తొడిమ నుంచి వేరు చేసినట్టుగా (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వం కొరకు మృత్యు బంధనం నుంచి విడిపించు గాక! 
 
ఈ మంత్రాన్ని సాధారణంగా ముమ్మారు గాని, 9 మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు.  ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్ట శక్తులను తరిమికొడతాయి. దాంతో మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు, ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. 
 
ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Akshaya Tritiya 2021: పితృదేవతలను తలచుకుంటూ అన్నం, నెయ్యి?