Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

03-06-2018 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. కుటుంబీకులు.. బంధుమిత్రులతో...

మేషం: కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి నెలకొంటుంది. పాత మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. రాజ

03-06-2018 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. కుటుంబీకులు.. బంధుమిత్రులతో...
, ఆదివారం, 3 జూన్ 2018 (09:38 IST)
మేషం: కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి నెలకొంటుంది. పాత మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. రాజకీయాలలో వారికి పార్టీ వారితో గాని కార్యకర్తలతో గాని సమస్యలు తలెత్తుతాయి. 
 
వృషభం: కుటుంబీకులు, బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ శ్రమకు లభించిన ప్రతిఫలంతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. మీ ఏమరుపాటుతనం వల్ల ధననష్టం, విలువైన వస్తువులు చేజారిపోవటం వంటి చికాకులు ఎదుర్కుంటారు. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. పెద్దలతో వాదోపవాదాలకు దిగవద్దు. 
 
మిథునం: పెద్దమెుత్తం రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన, మెళకువ అవసరం. మీ శ్రీమతి వైఖరి విసుగు కలిగిస్తుంది. బంధుమిత్రుల వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కుంటారు. కుటుంబ సభ్యులతో కలసి విహారయాత్రలలో ఉల్లాసంగా గడుపుతారు. 
 
కర్కాటకం: మీ సంతానం విలాసాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. రాజీమార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ద్విచక్ర వాహనాలపై దూరప్రయాణాలు క్షేమంకాదని గమనించండి. స్త్రీలు ఒత్తిళ్ళు, మెుహమాటాలకు పోవడం వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు. 
 
సింహం: మార్కెట్ రంగాలవారు టార్గెట్లను సునాయాసంగా పూర్తిచేస్తారు. సోదరీసోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి అధికమవుతుంది. దూరప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
కన్య: సన్నిహితులతో కలసి, సభలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
తుల: స్త్రీలకు టీవి ఛానెళ్ళ కార్యక్రమాల పట్ల ఆసక్తి, తగిన అవకాశాలు కలిసివస్తాయి. సాహసకృత్యాలు, ప్రయోగాలకు దూరంగా ఉండాలి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. 
 
వృశ్చికం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు స్వీయఆర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. వాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదని గమనించండి. ఎండుమిర్చి, నూనె, బెల్లం, ఆవాలు, పసుపు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
ధనస్సు: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. సంతానంపై చదువులపై శ్రద్ధ వహిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూకోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, చుట్టుపక్కల వారి ప్రోత్సాహం లభిస్తుంది.
 
మకరం: వృత్తుల వారికి సదవకాశాలు లభించినా ఆశించినంత సంతృప్తి ఉండదు. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కంప్యూటర్, ఎలక్ట్రానిక్, మీడియా రంగాల్లోవారికి సదవకాశాలు లభిస్తాయి.
 
కుంభం: పీచు, ఫోమ్, లెదర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి పొందుతారు. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాలవారికి మార్పులు అనుకూలిస్తాయి. రాజకీయనాయకులకు ప్రజాదరణ అధికంగా ఉంటుంది. స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారితో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. దైవదర్శనాలు, మెుక్కుబడులు అనుకూలిస్తాయి.
 
మీనం: విందు, వినోదాలలో పాల్గొంటారు. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ప్రయాణాలు ఆశించిన ఫలితం ఉంటుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ యమునా నేను కనుక ఏమి తినని పక్షంలో... వ్యాసుడు అలా ఎందుకన్నాడంటే?