బుధవారం (30-05-18) - సంపాదనకు మించి ఖర్చులు...

మేషం: ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమెుబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నం వాయిదా వేయడం మంచిది. నిరుద్య

బుధవారం, 30 మే 2018 (08:43 IST)
మేషం: ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమెుబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నం వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. 
 
వృషభం: ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. స్త్రీల మనోవాంఛలు నెరవేరటంతో కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు. దంపతుల మధ్య సఖ్యతాలోపం, చీటికి మాటికి విసుక్కోవటాలు వంటివి చోటు చేసుకుంటాయి. 
 
మిథునం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. క్లిష్టమైన సమస్యలు తలెత్తినా సమర్థతతో ఎదుర్కుంటారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహించి ప్రసంశలను పొందుతారు. సంపాదనకు మించి ఖర్చులు ఉంటాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బుందులకు గురవుతారు. 
 
కర్కాటకం: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బుందులు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకూల పరుస్తాయి. స్త్రీల మాటకు బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సుతో మంచి అవకాశం లభిస్తుంది. 
 
సింహం: కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులు రాత, మౌళిక పరీక్షల్లో ఏకాగ్రత వహించిన మంచి ఫలితాలు లభిస్తాయి. మీ సంతానం ఉన్నత విద్యల కోసం కొంత మెుత్తం పొదుపు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
కన్య: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఆశాజనకం. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో మీలో విసుగు, చికాకులు, ఆందోళన చోటు చేసుకుంటాయి.
 
తుల: విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్లీడర్లకు తవ క్లయింట్‌‌‌‌‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు. ఉద్యోగ విరమణ చేసిన వారికి తోటివారు సాదర వీడ్కోలు పలుకుతారు. 
   
వృశ్చికం: వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. స్త్రీలకు ఆరోగ్యం అంత సంతృప్తికరంగా ఉండదు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. 
 
ధనస్సు: కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రయాణాలు, తీర్థయాత్రలలో అసౌకర్యానికి గురవుతారు. వృత్తి, వ్యాపారాల్లో గణనీయమైన మార్పులుంటాయి. మనుష్యుల మనస్థత్వము తెలిసి మసలుకొనుట మంచిది. 
 
మకరం: వైద్య రంగాల వారికి అన్ని విధాల కలిసిరాగలదు. ఖర్చులు అధికమవుతాయి. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టటం వల్ల కాంట్రాక్టర్లు సమస్యలకు లోనవుతారు. మీ బంధువుల పరపతి మీకే విధంగానూ ఉపయోగపడదు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. 
 
కుంభం: ఆర్ధిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ప్రతి విషయంలోను మీదే పైచేయిగా ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి.  
 
మీనం: మార్కెట్ రంగాల వారు టార్గెట్లను పూర్తి చేస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శివుడు స్వయంభువుడుగా ఎలా పుట్టాడు? ఆ అమ్మకు అదే ప్రశ్న?