Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గురువారం రాశిఫలాలు - సమస్యలు తలెత్తినా ధైర్యంగా...

మేషం: ఉద్యోగస్తులు చాకచక్యంగా వ్యవహరించి ఒక సమస్యనుంచి క్షేమంగా బయడపడతారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎదుటివారి వాఖ్యాలు మీపై తీవ్రంగా పనిచేస్తాయి. మీ రాక బంధువులకు ఎం

Advertiesment
గురువారం రాశిఫలాలు - సమస్యలు తలెత్తినా ధైర్యంగా...
, గురువారం, 31 మే 2018 (07:55 IST)
మేషం: ఉద్యోగస్తులు చాకచక్యంగా వ్యవహరించి ఒక సమస్యనుంచి క్షేమంగా బయడపడతారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎదుటివారి వాఖ్యాలు మీపై తీవ్రంగా పనిచేస్తాయి. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్నిస్తుంది. కుటుంబసౌఖ్యం, వాహన యోగం పొందుతారు. 
 
వృషభం: వృత్తిపరంగా చికాకులు, సమస్యలు తలెత్తినా ధైర్యంగా ఎదుర్కొంటారు. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ఎంతో ముఖ్యం. ఇంటా బయటా మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. 
 
మిథునం: చెక్కుల జారీ, ఖాతాదారులు, పనివారలతో జాగ్రత్తగా ఉండాలి. ద్విచక్ర వాహనాలపై దూరప్రయాణాలు క్షేమంకాదని గమనించండి. మీ సంతానం భవిష్యత్తు బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ ప్రయత్నం ఫలించదు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమెుబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. 
 
కర్కాటకం: రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఎదుటివారిని అతిగా విశ్వసించటం అంత మంచిది కాదని గమనించండి. భాగస్వామికులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది, మెళకువ వహించండి. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది.  
 
సింహం: స్త్రీలు ఉద్యోగ ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం ఎంతైనా అవసరం. పెద్దల ఆరోగ్యము గురించి జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. మీరు చేయబోయే మంచి పని విషయంలో అనుమానాలు విడనాడి శ్రమించండి. 
 
కన్య: శారీరక, శ్రమ, మానసిక ఒత్తిడి వల్ల అస్వస్థతకు గురవుతారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూలకోసం పడిగాపులు పడతారు. ఉద్యోగస్తులకు హోదా పెరగటం, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభపరిణామాలుంటాయి. 
 
తుల: ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి అధికారిక వేధింపులు అధికం. మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూ లేఖలు అందుకుంటారు. పొట్ట, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. ఓ చిన్న విహారయాత్ర చేస్తారు.
 
వృశ్చికం: సంగీత, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
ధనస్సు: విద్యార్థులు ఉన్నత విద్యల కోసం విదేశాలు వెళ్ళేందుకు మార్గం సుగమమవుతుంది. కొబ్బరి, పండ్ల, పూలు, పానీయ చిరు వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు అధికారుల నుండి ఒత్తిడి, కార్మికులతో సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు తోటివారితో లౌక్యం అవసరం.
 
మకరం: సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పనిభారం అధికం. బంధువులను కలుసుకుంటారు. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది.
 
కుంభం: ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. మార్కెటింగ్ రంగాల వారు మార్పులకై చేయు యత్నాలలో సఫలీకృతులవుతారు. ప్రైవేటు సంస్థలలోవారికి విధి నిర్వహణలో ఏకాగ్రత లోపం వల్ల మాటపడక తప్పదు. దైవ సేవా, పుణ్యకార్యాలలో చురుకుగా వ్యవహరిస్తారు.
 
మీనం: ఆర్థికంగా అభివృద్ధి కానవచ్చినా మానసిక ప్రశాంతత ఉండజాలదు. స్త్రీలలో దాగియున్న రచనా పటిమకు, కళాత్మతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. కొంతమంది మీ నుండి ధన, వస్తు సహాయం ఆశించవచ్చు. రాజకీయాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దోచుకునేవారికి చివరికి మిగిలేదేమిటో తెలుసా? ఖచ్చితంగా తెలుసుకోవాలి...