Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒత్తిడికి చెక్ పెట్టే గ్రిల్డ్ చికెన్ ఎలా చేయాలి.. (video)

Advertiesment
Stress
, సోమవారం, 30 డిశెంబరు 2019 (13:03 IST)
శీతాకాలంలో జలుబును, దగ్గును దరిచేర్చకుండా వుంచాలంటే.. చికెన్‌ను వారానికి ఓసారైనా ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే మిరియాలను కూడా వంటల్లో చేర్చుకోవాలి. చికెన్‌లో రోగనిరోధకశక్తిని పెంచే ఎన్నో పోషకాలు ఉంటాయి. చికెన్‌ను పెప్పర్ సూప్‌లో ఉడికించి తీసుకుంటే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు. సన్నగా, పీలగా ఉన్నవారు ప్రతిరోజు చికెన్ సూప్ తాగితే వారి శరీరానికి తగినంత బలం చేకూరుతుంది. 
 
చికెన్‌లో ఉండే అమైనో యాసిడ్స్ పిల్లలు ఎత్తు పెరగటానికి సహాయపడతాయి. చికెన్ తినేవారిలో చికెన్‌లో ఉండే సెలీనియం వలన కీళ్ల నొప్పులు తక్కువగా వస్తాయి. ఇంకా పిల్లలకు నచ్చే విధంగా చికెన్‌లో స్నాక్స్ తయారు చేసి పెడితే వారు ఇష్టపడి తింటారు. 
 
ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నవారు గ్రిల్డ్ చికెన్‌ను తింటే చికెన్‌లో ఉండే ఫాంటోథెనిక్ యాసిడ్ ఒత్తిడిని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటంతో ఒత్తిడి తగ్గుతుంది. చికెన్‌లో ఉండే బీ6 విటమిన్ గుండెనొప్పికి కారణమైన హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గిస్తుంది. మహిళలు చికెన్ రుతుక్రమ సమయంలో తింటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 
 
ఒత్తిడిని మటాష్ చేసే గ్రిల్డ్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం.. 
కావలసిన పదార్థాలు:
చికెన్ ముక్కలు- కేజీ 
పచ్చిమిర్చి పేస్ట్ - రెండు స్పూన్
ఉల్లిపాయ పేస్ట్- నాలుగు స్పూన్లు
కొత్తిమీర, పుదీనా పేస్ట్- చెరో రెండు స్పూన్లు 
హనీ- ఆరు టేబుల్ స్పూన్లు
నిమ్మకాయ- రెండు
వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు
ఉప్పు- తగినంత, 
ఆలివ్ నూనె - తగినంత 
 
తయారీ విధానం.. 
ముందుగా చికెన్ ముక్కల్ని శుభ్రం చేసుకుని కుక్కర్లో పసుపు పొడి, కాసింత ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. బాగా ఆరిన తర్వాత చికెన్ ముక్కలకు మిర్చి, వెల్లుల్లి, ఉల్లి, కొత్తిమీర పేస్టులను పట్టించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కలుపుకుని అరగంట నానబెట్టాలి. ఇందులోనే ఓ టేబుల్‌స్పూను ఆలివ్ నూనె కూడా వేసి కలపాలి. తర్వాత నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి చికెన్‌ ముక్కల్ని రెండువైపులా కాల్చి తీయాలి. ఓవెన్‌ ఉంటే అందులో కూడా గ్రిల్‌ చేసుకోవచ్చు. చివరిగా వీటికి హనీ రాసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ఈ చికెన్‌ను రోజుకో ముక్క తీసుకుంటే పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రాగన్ ఫ్రూట్ తింటే బరువు ఇట్టే తగ్గిపోతారట..