Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్రాగన్ ఫ్రూట్ తింటే బరువు ఇట్టే తగ్గిపోతారట..

డ్రాగన్ ఫ్రూట్ తింటే బరువు ఇట్టే తగ్గిపోతారట..
, సోమవారం, 30 డిశెంబరు 2019 (12:18 IST)
డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవాల్సిందే. బరువు తగ్గాలనుకునేవారికి డ్రాగన్ ఫ్రూట్స్ బెస్ట్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ కేలరీలు ఉండవు. ఇందులోని గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. మధ్యలో గింజలుంటాయి. ఇవి అరటిపండ్లలో గింజల్లా ఉంటాయి. అందువల్ల ఈ పండును తినేవారు గింజలతో సహా తీసుకోవాలి. ఆ గింజలు కరకరలాడుతాయి. 
 
డ్రాగన్ పండ్లలో విటమిన్ సీ, ఈ పెద్ద మొత్తంలో ఉంటాయి. అలాగే ఐరన్, మెగ్నీషియం కూడా ఎక్కువే. అందువల్ల ఈ పండ్లు ఎంత తింటే అంత చురుకుగా మారతారు. చాలా శక్తి వస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఈ పండ్లు ఎంతో మంచివి. డ్రాగన్ ఫ్రూట్స్‌లో అరిగిపోయే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. గుండెకు కూడా ఈ పండ్లు మేలు చేస్తాయి. 
  
డ్రాగన్ ఫ్రూట్ శరీరంలోని చెడు కొవ్వు పదార్థాలను, మంచి కొవ్వు పదార్థాలతో బదిలీ చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, దీనిలో ఉండే మోనోసాచురేటేడ్ ఫ్యాట్‌లు గుండె ఆకారాన్ని గొప్పగా ఉండేలా ప్రోత్సహిస్తాయి. 
 
డ్రాగన్ ఫ్రూట్, కాల్షియం, పాస్పరస్, ఐరన్, నియాసిన్ మరియు ఫైబర్‌లను కలిగి ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు, చర్మానికి మేలు చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ను దంచి, తేనె కలిపి, సహజయాంటీ ఏజింగ్ మాస్క్‌ను తయారు చేయవచ్చు. అంతేకాకుండా, దీని వాడకం ద్వారా మొటిమల నుండి ఉపశమనం కూడా పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సెలవిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలబంద వేర్లను ముక్కలు చేసి ఉడికించి అలా తీసుకుంటే?