చాలామంది చలికాలంలో ఆకుకూరలు తీసుకుంటే అజీర్ణ సమస్యలు వస్తాయని అనుకుంటారు. అయితే అది అపోహ మాత్రమే. చలికాలంలో ఆకుకూరలను తప్పక తీసుకోవాలి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వీటిలో ఏ, సీ, కే విటమిన్లు అధికంగా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్స్ కూడా కావాల్సినంత ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ వీటిలో పుష్కలంగా వుంటాయి. రోజూ ఆకుకూరలను తీసుకోవడం ద్వారా శరీరంలో ఎర్ర రక్తకణాలు వృద్ధి అవుతాయి. శ్వాస సంబంధమైన సమస్యలను దూరం చేస్తాయి.
ముఖ్యంగా చలికాలంలో మహిళలు పాలకూర తినడం చాలా మంచిది. మహిళల సౌందర్యా నికి కూడా పాలకూర తోడ్పడుతుంది. ఇంకా తేనెను కూడా రోజూ వాడాలి. గొంతు నొప్పికి, దగ్గుకు తేనె చాలా మంచిది. గొంతులో మంట తగ్గు తుంది. తేనెలో ఉండే యాంటి మైక్రోబయల్ గుణాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అందుకే రోజుకు ఒక స్పూను తేనె తాగితే మంచిది. తేనె పొట్టను శుభ్రంచేసి జీర్ణశక్తిని పెంచుతుంది.
రోజూ ఉదయాన్నే గోరువెచ్చటి నీటిలో తేనె వేసుకుని తాగితే ఎంతో మంచిది. ఇకపోతే.. చలికాలంలో క్యారెట్, బీట్‌రూట్, ఆలు వంటివి తప్పక డైట్‌లో చేర్చుకోవాలి. క్యారెట్‌ను తీసుకోవడం వల్ల శీతాకాలంలో తరుచూ వచ్చే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొం దొచ్చు. దగ్గు , జలుబుకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడగలిగే శక్తి ఇందులో ఉంటుంది. ఆలుగడ్డల్లో శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉన్నాయి.
అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సీ, బీ6 వీటిలో ఉంటాయి. అలాగే దానిమ్మను చలికాలంలో తప్పక తీసుకోవాలి. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా వుంటుంది. చలికాలంలో దానిమ్మను తీసుకుంటే ఎలాంటి మందులు అవసరం ఉండదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
దానిమ్మ గింజల్ని లేదంటే సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇది క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెండ్లు ఉండే దానిమ్మను తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలు దూరమవుతాయి. రోజుకో కప్పు గింజలు తింటే చెడు కొలెస్ట్రాల్ చేరదని వైద్యులు సెలవిస్తున్నారు.