Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్గిల్ విజయ్ దివస్-పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పిన ఇండియన్ ఆర్మీ

kargil war
, సోమవారం, 25 జులై 2022 (22:34 IST)
కార్గిల్ విజయ్ దివస్.. జులై 26న జరుపుకుంటున్నారు. 1999 జులై 26న తొలి కార్గిల్ విజయ్ దినోత్సవం జరిగింది.అప్పటి నుంచీ ప్రతీ సంవత్సరం ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం. 
 
ఈ విజయం వెనుక ఎంతో మంది సైనికుల ప్రాణ త్యాగం ఉంది. తమ ప్రాణాలను అడ్డుపెట్టి మన దేశాన్ని రక్షించడమే కాదు.. పాక్ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. పాకిస్థాన్‌ను ఏకాకి చేశారు. 
 
పాకిస్థాన్ వక్రబుద్ధిని భారత వీరులు విజయవంతంగా తిప్పి కొట్టారు. దాయాది దేశం పాకిస్తాన్‌ కన్ను ఎప్పుడూ భారత్ పైనే.. ముఖ్యంగా కశ్మీర్ మీదే ఉంటుంది. ఏదో ఒక వంకతో స్థానిక యువతను రెచ్చగొడుతూ దేశంలో అలజడి సృష్టిస్తూనే ఉంటుంది. అలాంటి ప్రయత్నమే 1999లో కూడా చేసింది. 
 
నిబంధనలు ఉల్లంఘించి నియంత్రణ రేఖ దాటి వచ్చి మన ఆర్మీపై దాడికి తెగబడింది. ఇండియన్‌ ఆర్మీ ధీటుగా స్పందించింది. ఆపరేషన్‌ విజయ్‌ పేరుతో పాక్‌కు బుద్ధి చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్గిల్ వార్ ఎలా జరిగింది.. ఆ యుద్ధానికి కారణం ఏంటి?