ఐడియా అదిరిపోయే ఆఫర్...

శుక్రవారం, 3 మే 2019 (17:31 IST)
ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటైన ఐడియా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్‌ వర్తించాలంటే ప్రతి ఖాతాదారుడు నాలుగు వేల రూపాయలను ఖర్చు చేయాల్సివుంది. నెలకు రూ.4 వేలు ఖర్చు చేస్తే చాలు. ప్రతి రోజూ 1.5 జీబీ డేటాతో పాటు.. అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఇవ్వనుంది. 
 
ఐడియా కంపెనీ సిటీ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు ఐడియా ప్రీపెయిడ్ యూజర్లు తొలుత ఐడియా వెబ్‌సైట్ నుంచి సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. కార్డు చేతికి అందిన తర్వాత నెల రోజుల్లోపు రూ.4 వేలు ఖర్చు చేయాలి. అంత మొత్తం ఖర్చయిన వెంటనే ఈ ఆఫర్‌కు యూజర్లు అర్హులవుతారు. వోడాఫోన్ వినియోగదారులకు ఏమాత్రం వర్తించదు. ఈ ఆఫర్ జూలై 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. 
 
అయితే, ఇక్కడో మెలిక పెట్టింది. ఈ ఆఫర్ పొందగోరు ఖాతాదారుల వయసు కనీసం 23 ఏళ్లు ఉండి, అహ్మదాబాద్, బరోడా, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, ముంబై, నోయిడా, పుణె, సికింద్రాబాద్‌లలో నివసిస్తున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఐడియా తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పేరుకే ఆటో డ్రైవర్.. వామ్మో కోటి రూపాయల విల్లాలో వుంటున్నాడు..