Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?

బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
, మంగళవారం, 26 మార్చి 2019 (11:00 IST)
చాలామంది తరచు చెప్పే మాట.. ఆ ఇంట్లో ఉన్నప్పటి నుండి చెడు ఆలోచనలు వస్తున్నాయని చెప్తుంటారు. అందుకు ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. మనిషి - ఆలోచనలు.. రెండూ అత్యంత సమీపంగా ఉంటాయి. ఆలోచనల భౌతిక రూపమే మనిషి అని కూడా నిర్వచించవచ్చును.
 
కానీ ఆలోచన - మనస్సు, బుద్ధి కంటే అతీతమైనంది ఉంది.. అదే మనం అని తెలిపే జ్ఞానమే మానవుని జన్మలక్ష్యం. అందుకే భూమి మీదకు ఎన్నో గొప్ప శాస్త్రాలను ఋషులు ధారపోశారు. మీరు గృహంలోకి వచ్చినప్పటి నుండి అంటున్నారు. కానీ ఆ నెగెటివ్ థాట్స్ అప్పుడే పుట్టినవి అక్కడే పుట్టినవి అని నిర్ధారించడం కూడా సరైన విధానం కాదు.
 
అంతకు ముందు ఎన్నో చోట్ల ఉన్నారు. మనో మాలిన్య ప్రపంచంలో సంచరిస్తున్న మనిషికి ఒక స్థానం అని చెప్పలేం. ఎక్కడ పొల్యూషన్ లేదని చెప్పలేం. మీరు గొప్ప శాస్త్ర గృహంలోకి చేరింది వాస్తవమే. అయితే దాని పరిసరాలు బాగుంటే అంటే మీ ఇంటి ఆవరణ చుట్టూ చక్కని ప్రశాంత పచ్చదనపు పరిసరాలు ఉంటే మీకు త్వరలోనే ఉపశమనం లభిస్తుంది.
 
అంతేకాదు, చెడు ఆలోచనలు పోవాలంటే గొప్ప పరిసరాలతో పాటు గొప్ప అలవాట్లు కూడా ఏర్పరచుకోవాలి. చెడుకు ద్వారాలు కళ్లు, నోరు, చెపులు.. వీటి పట్ల శ్రద్ధ, వాటి మోజు పట్ల నియంత్రణ కావాలి. బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు. నిరంతరం ఆ నిరాకారుని చట్రంలో మన ప్రపంచం ఈ భూమండలం చలిస్తుంది అన్నది మరవకూడదు. భావన మారితే బతుకు మారుతుంది. ఇంటి లక్ష్యం కూడా అదే. మనిషిలోనే తృప్తి ఉంది. మనిషిని మించిన అద్భుతం, ఆనందం లేదు. అది అర్థం కావడానికి శాస్త్రం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-03-2019 మంగళవారం దినఫలాలు - వృషభం రాశివారు అలా చేయడం వల్ల...