Publish Date: Wed, 27 Jul 2022 (18:06 IST)
Updated Date: Wed, 27 Jul 2022 (18:07 IST)
స్కై వాచర్లకు గుడ్ న్యూస్ తీసుకొచ్చింది నాసా. పెర్సీడ్ ఉల్కాపాతం ఈ ఏడాది అత్యంత అద్భుతంగా కనిపించబోతున్నట్టు నాసా పేర్కొంది. ఇది జులై, ఆగస్టు నెలల మధ్య ఏర్పడుతుందని స్పేస్ సైంటిస్టులు చెప్తున్నారు.
ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన కాస్మిక్ లైట్ షోగా ఇది ఉంటుందని టాక్. ప్రతి సంవత్సరం భూమి జులై 17 నుంచి ఆగస్టు 24 తేదీల మధ్య కామెట్ స్విఫ్ట్ టటిల్ (Comet Swift-Tuttle ) మార్గంలో వెళ్తుంది.
ఆ సమయంలో భూమి దట్టమైన, ధూళి ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అంటే.. దాదాపు ఆగస్టు 11, 12 తేదీల వరకు ఇట్లాంటి పెర్సీడ్ ఉల్కాపాతం కనిపించే అవకాశాలున్నాయి.