Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీటెక్/బీఈ పూర్తిచేసిన వారికి గుడ్ న్యూస్-17 పోస్టుల భర్తీ

Advertiesment
బీటెక్/బీఈ  పూర్తిచేసిన వారికి గుడ్ న్యూస్-17 పోస్టుల భర్తీ
, బుధవారం, 6 జులై 2022 (19:56 IST)
కోల్‌కతా ప్రధాన కేంద్రంగా నడిచే ఈ సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. 
 
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సివిల్‌ ఇంజినీరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ (15), ఎలక్ట్రికల్‌ కన్‌స్ట్రక్షన్‌ (02) పోస్టులు ఉన్నాయి.
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు 2021/ 2022 వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
 
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.  అభ్యర్థులు తమ దరఖాస్తులను సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌, సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే, గార్డెన్‌ రీచ్‌ రోడ్‌, కోల్‌కతా-700043 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
 
దరఖాస్తుల స్వీకరణకు 18-07-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులను గేట్‌ మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదేళ్ల బాలుడిని చిత్రహింసలకు గురిచేసిన టీచర్