Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐదేళ్ల బాలుడిని చిత్రహింసలకు గురిచేసిన టీచర్

Advertiesment
crime scene
, బుధవారం, 6 జులై 2022 (19:15 IST)
విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. కనీసం కనికరం లేకుండా కర్కశంగా ప్రవర్తిస్తూ.. ఐదేళ్ల బాలుడిని చిత్ర హింసలకు గురిచేశాడు.
 
బీహార్‌లో జరిగిన ఈ దారుణమైన ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోగా.. నిందితుడైన యువకుడిపై మండిపడుతున్నారు నెటిజన్లు.
 
వివరాల్లోకి వెళ్తే.. వీర్ ఒరియా ప్రాంతంలో జయ పేరుతో కోచింగ్‌ సెంటర్‌ నడుస్తోంది. ఆ సెంటర్‌లో చోటు అనే యువకుడు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండగా.. తాజాగా, ఓ ఐదేళ్ల బాలుడి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. 
 
సరిగ్గా చదవడం లేదన్న కారణంతో విచక్షణారహితంగా ప్రవర్తించాడు. ఆ బాలుడిపై దాడి చేశాడు. ఆ బాలుడు ఏడుస్తున్నా.. కొట్టొద్దని ప్రాధేయపడినా కనికరం చూపలేదు. ఆ కర్ర విరిగేదాగా కొట్టాడు. చెంపదెబ్బలు కొట్టాడు. ఈ వీడియోను నెట్టింట వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర మంత్రి నఖ్వీ రాజీనామా.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా?