కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డియర్‌నెస్ అలవెన్స్ 5 నుంచి 6 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులు డీఏ ప్రయోజనం పొందవచ్చు.
ఒకటిన్నర సంవత్సరాలకు పైగా డిఏ బకాయిలు కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజా నిర్ణయం పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. ఆగస్టు 3న జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏ పెరగుదలపై నిర్ణయం రానుంది.
బకాయిలపై ఉద్యోగులు, పెన్షనర్లు మోడీ ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరగా తమ బకాయిలు చెల్లించాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 3న జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు 34 శాతం డీఏ ఇస్తోంది.
2021 నుంచి ప్రభుత్వం డీఏను మొత్తం 11 శాతం పెంచింది. అంటే మార్చి 2022లో 31 శాతం నుండి 34 శాతానికి పెంచింది. ఇప్పుడు 5 శాతం పెంచితే డీఏ 39 శాతానికి చేరుకుంటుంది. ఈ ప్రయోజనం 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు చేకూరనుంది.