Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్టెమిస్ సిబ్బందిని ప్రశంసించిన ట్రంప్.. అంగారక గ్రహంపై తదుపరి అడుగు (video)

Advertiesment
Artemis II Success
Artemis II Success
చంద్రుడిపై యాత్రను పూర్తి చేసుకున్న ఆర్టెమిస్ వ్యోమగాములపై అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. శుక్రవారం నాడు, ఆర్టెమిస్ వ్యోమగాములు పసిఫిక్ మహాసముద్రంలో విజయవంతంగా దిగి, చంద్రుని చుట్టూ తమ ప్రయాణాన్ని ముగించారు. 
 
భవిష్యత్తులో అంగారక గ్రహానికి యాత్రలు పంపాలనే లక్ష్యం వైపు దృష్టి సారిస్తున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్టెమిస్ II సిబ్బందికి అభినందనలు. 
 
ఈ మొత్తం ప్రయాణం అద్భుతంగా సాగింది, ల్యాండింగ్ పరిపూర్ణంగా జరిగింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా, నేను ఇంతకంటే ఎక్కువ గర్వపడలేను.. అని ట్రంప్ అన్నారు. త్వరలోనే మీ అందరినీ వైట్ హౌస్‌లో చూడాలని ఎదురుచూస్తున్నాను. తదుపరి అడుగు, అంగారక గ్రహం.. అంటూ ట్రంప్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజా మద్దతు చూస్తుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం.. స్టాలిన్ ధీమా