Publish Date: Wed, 08 Apr 2026 (10:37 IST)
Updated Date: Wed, 08 Apr 2026 (10:45 IST)
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరాన్‌తో చర్చలు జరపడానికి, ఒక ఒప్పందానికి రావడానికి గతంలో విధించిన గడువును మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పాకిస్తాన్ ఈ ఇరు దేశాల మధ్య సంధి కుదర్చడానికి ప్రయత్నస్తుంది.
దాదాపు నెల రోజుల పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ యుద్ధం ప్రస్తుతానికి ఆగింది. ఇరాన్ సంపూర్ణ నాగరికత నాశనం కావచ్చునని అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మూడో ప్రపంచ యుద్ధం ఖాయమన్న భయాందోళనల నేపథ్యంలో అయితే, పాకిస్తాన్ చేసిన ప్రత్యేక అభ్యర్థన మేరకు ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
14 రోజుల పాటు దాడులను నిలిపివేస్తూ, శాంతి చర్చలకు అవకాశం కల్పించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ 14 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్లు, ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ 14 రోజుల్లో చర్చలు సఫలమైతే యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది.
అంతేగాకుండా హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకోవాలనే షరతుపైనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజ్ ఫైర్ రెండు వైపులా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రపోజల్‌ను పరిశీలించేందుకు అమెరికా సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం.
అమెరికా ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించింది. రానున్న రెండు వారాల పాటు హార్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చి అధికారికంగా ప్రకటించారు.
తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నిలిపివేస్తే, తాము కూడా దాడులకు వెళ్ళమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్‌తో సాంకేతిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని నౌకల రాకపోకలకు అనుమతినిచ్చారు.