Publish Date: Wed, 08 Apr 2026 (13:53 IST)
Updated Date: Wed, 08 Apr 2026 (13:55 IST)
బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో బంగారం, వెండి అనూహ్యంగా పుంజుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై రెండు వారాల పాటు బాంబు దాడులు, దాడులను నిలిపివేయడానికి అంగీకరించడంతో, ఇంధన ఆధారిత ద్రవ్యోల్బణం భయాలు తగ్గాయి.
దీంతో బుధవారం బంగారం ధరలు దాదాపు మూడు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఫలితంగా స్పాట్ గోల్డ్ 2.3శాతం పెరిగి ఔన్సుకు $4,812.49 వద్ద ఉంది. సెషన్ ప్రారంభంలో, బులియన్ 3శాతం పైగా పెరిగి మార్చి 19 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.3,650 పెరగగా, కిలో వెండి రూ.10 వేలకు పైగా పెరిగింది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం సోమవారంతో పోలిస్తే రూ.1,53,800కు, 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.2,999 పెరిగి రూ.1,41,000కు చేరింది. కిలో వెండి రూ.10 వేలు పెరిగి నిన్నటితో పోలిస్తే రూ.2.65 లక్షలకు చేరుకుంది.