Publish Date: Wed, 08 Apr 2026 (11:05 IST)
Updated Date: Wed, 08 Apr 2026 (11:09 IST)
అమెరికా- ఇరాన్ యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపడంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ మూడో ప్రపంచ యుద్ధం నుంచి ప్రపంచాన్ని గట్టెకించారు. లెబనాన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా తక్షణమే కాల్పుల విరమణ పాటించేందుకు అమెరికా, ఇరాన్‌తో పాటు వాటి మిత్రదేశాలు అంగీకరించాయని షెహబాజ్ షరీఫ్ అధికారికంగా ప్రకటించారు.
14 రోజుల పాటు ఉద్రిక్తతలను తగ్గించడంలో పాకిస్థాన్ దౌత్య విజయాన్ని సాధించింది. ఇటు ముస్లీం దేశంగా ఇరాన్‌కు, అటు మిత్రదేశంగా అమెరికాకు దగ్గరగా ఉన్న పాకిస్తాన్‌కు ఈ పని సాధ్యమైంది. మొదట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్లాన్‌ను పాకిస్తాన్ ఇరాన్‌కు చేరవేసింది. కానీ దానికి ఇరాన్ ఒప్పుకోలేదు. అప్పుడు ట్రంప్ 10 రోజులు డెడ్‌లైన్ విధించారు.
శాంతి స్థాపనలో భాగంగా, 2026 ఏప్రిల్ 10న టెహ్రాన్, వాషింగ్టన్ ప్రతినిధి బృందాలను ఇస్లామాబాద్‌కు షరీఫ్ ఆహ్వానించారు. దశల వారీగా ఈ చర్చలు జరుగుతాయి. ఇందులో ఇరాన్ ప్రతిపాధించిన 10 కండీషన్లు అమెరికా పరిశీలిస్తుంది.
మరోవైపు, ఇరాన్ సర్వోన్నత జాతీయ భద్రతా మండలి కూడా రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ధృవీకరించింది. పాకిస్తాన్ ఈ మధ్యవర్తిత్వం వహించేందుకు కొన్ని స్వార్థ ప్రయోజనాలు వున్నాయి. చమురు రవాణా, సరిహద్దు భద్రత వంటివి అంశాలున్నాయి.