Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంద విహీనంగా మారిన 'సిటీ ఆఫ్ ఏంజెల్స్' - కార్చిచ్చును ఆర్పేందుకు నీటి కొరత - మృతులు 24

Advertiesment
Wildfires

ఠాగూర్

, సోమవారం, 13 జనవరి 2025 (10:57 IST)
సినీ ఆఫ్ ఏంజెల్స్‌గా పిలిచే లాస్ ఏంజెలెస్ నగరం ఇపుడు అంద విహీనంగా మారిపోయింది. ఈ నగరంలో చెలరేగిన కార్చిచ్చు నగరాన్ని దహనం చేస్తోంది. కాలిఫోర్నియాలోని మొత్తం ఆరు చోట్ల దావానలం మొదలు కాగా, లాస్ ఏంజెలెస్ మొదలైన ‘ప్యాలిసేడ్స్ వైల్డఫైర్' విధ్వంసం సృష్టిస్తోంది. నిర్మాణాలను బుగ్గి చేస్తోంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపకశాఖకు శక్తి సరిపోవడం లేదు. దీనికితోడు నీటి కొరత తీవ్రంగా వేధిస్తుంది. మరోవైపు, ఈ కార్చిచ్చులో చిక్కుకుని ఇప్పటివరకు 24 మంది చనిపోయినట్టు సమాచారం. 
 
మరోవైపు, హాలీవుడ్ నటులు తమ ఇళ్లను కాపాడుకునేందుకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. రోజుకు దాదాపు రూ.40 లక్షల వరకు ఖర్చు చేసేందుకు రెడీ అంటున్నారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ నటుల తీరుపై స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీటి కొరత ఉన్నప్పటికీ వారు విచ్చలవిడిగా వాడేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలను సైతం బేఖాతరు చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
నీటి సంరక్షణ కోసం 2022లో ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇంటి చుట్టూ ఉండే మొక్కలు, పచ్చికకు వారానికి రెండుసార్లు మాత్రమే, అది కూడా ఒక్కోసారి 8 నిమిషాలకు మించి నీరు పట్టకూడదన్నది నిబంధనల్లో ఒకటి. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది.
 
కానీ, కిమ్ కర్దాషియన్, సిల్వెస్టర్ స్టాలోన్, ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్, పారిస్ హిల్టన్, బిల్లీ క్రిస్టల్, ఆంథోనీ హాప్కిన్స్, మెల్ గిబ్సన్ వంటి నటులు నీటిని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నటి కిమ్ కర్దాషియన్ అయితే వాడాల్సిన దానికంటే 8 లక్షల లీటర్లకుపైగా అదనంగా నీటిని వాడారు. సామాన్యులు నీటి కొరతతో ఇబ్బంది పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం ఇలా విచ్చలవిడిగా నీటిని వాడటంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 
 
కార్చిచ్చు కారణంగా లక్షలాదిమంది తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతుంటే సెలబ్రిటీలు మాత్రం తమ విలాసవంతమైన భవనాలను కాపాడుకునేందుకు నీటిని దుబారా చేస్తున్నారని మండిపడుతున్నారు. కాగా, కాలిపోర్నియాను వణికిస్తున్న పాలిసేడ్స్, ఈటన్ కార్చిచ్చుల కారణంగా ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోగా, 12,300 ఇళ్లు, వ్యాపార సముదాయాలు కాలి బూడిదయ్యాయి. 
 
అదేసమయంలో హాలీవుడ్ స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా వాడేసుకొని తమ గార్డెన్లను పెంచుతున్నరాని డెయిలీ మెయిల్ కథనంలో పేర్కొంది. 2022 నుంచి లాస్ ఏంజెలెస్‌లో నీటి వినియోగంపై ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ఎవరైనా సరే తమ తోటకు నీరు పెట్టాలంటే.. వారానికి రెండు సార్లు ఎనిమిది నిమిషాలు మాత్రమే వాడుకోవాలి.
 
నటి కిమ్ కర్దాషియన్ ది ఓక్స్‌లోని తన 60 మిలియన్ డాలర్ల ఇంటి చుట్టు తోటను పెంచేందుకు తనకు కేటాయించిన నీరు కంటే 2,32,000 గ్యాలన్లను అదనంగా వాడుకొన్నట్లు అధికారులు గుర్తించారు. కండల వీరుడు సిల్వస్టెర్ స్టాలోన్, కెవిన్ హార్ట్ వంటి వారు అదనంగా నీరు వాడుకుని జరిమానాలు చెల్లించారు. కార్చిచ్చు ప్రారంభమైన ప్రదేశానికి దగ్గర్లోనే కిమ్ కర్దాషియన్ ఇల్లు ఉంది. తాజాగా ఆమె కూడా ఇంటిని ఖాళీ చేసింది. కొందరు హాలీవుడ్ స్టార్లు గంటకు 2,000 డాలర్లు చెల్లించి.. ప్రైవేటు ఫైరైఫైటర్లను నియమించుకోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు లోగిళ్ళలో భోగి మంటలు.. మొదలైన సంక్రాంతి సంబరాలు