దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను శక్తివంతమైన తుఫాన్ అతలాకుతలం చేసింది. మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భారీ వర్షాలు కురిశాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దుబాయ్ నగరంలో ఆకాశం నుంచి వేల వోల్టుల శక్తితో కరెంటు తీగలు వేలాడాయా అన్నట్లు పెద్దపెద్ద భారీ ఉరుము శబ్దాలతో పిడుగులు పడ్డాయి. దుబాయ్ అంతటా రోడ్‌వేలపై వాహనాలు నీటిలో కొట్టుకుపోవడం కనిపించింది. దుబాయ్‌కి పొరుగున ఉన్న ఒమన్‌లో వేర్వేరు భారీ వరదలలో మరణించిన వారి సంఖ్య 18కి పెరిగింది.
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలకు విపరీతమైన గాలులు అంతరాయం కలిగించడంతో వాటిని దారి మళ్లించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫా కొనను తాకుతూ ఆకాశం నుంచి భారీ మెరుపు తీగలు తాకుతున్న దృశ్యాలు కనిపించాయి. దుబాయ్ లో ప్రకృతి బీభత్సం కారణంగా పలు పాఠశాలలకు శెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా దుబాయ్ వీధుల్లో వాహనాలు రోడ్లపై కొట్టుకుపోతూ కనిపించాయి.