డోక్లామ్‌లో చైనా కలకలం: 400 మీటర్ల పొడవైన గోడ నిర్మాణం
డోక్లామ్‌లో మళ్లీ చైనా కలకలం రేపింది. డోక్లామ్ సమీపంలో సొరంగాలు, బ్యారక్‌ల వంటి భారీ నిర్మాణాలను చేపట్టింది. ఈ పనులు భారత బలగాలకు కనిపించకుండా 400 మీటర్ల పొడవైన గోడను కూడా నిర్మించింది. డోక్లామ్ సమీప
డోక్లామ్‌లో మళ్లీ చైనా కలకలం రేపింది. డోక్లామ్ సమీపంలో సొరంగాలు, బ్యారక్‌ల వంటి భారీ నిర్మాణాలను చేపట్టింది. ఈ పనులు భారత బలగాలకు కనిపించకుండా 400 మీటర్ల పొడవైన గోడను కూడా నిర్మించింది. డోక్లామ్ సమీపంలోని చైనా భూభాగంలో 200 అత్యాధునిక నిఘా వ్యవస్థ గల టెంట్లను ఏర్పాటు చేసినట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. వివాదాస్పద డోక్లామ్‌లో సైనికులకు శాశ్వత స్థావరాల కోసం చైనా 16 బ్యారక్‌లు, ఆరు సొరంగాలు తవ్వించినట్లు సమాచారం.
డోక్లామ్‌లో చైనా చర్యలకు ధీటుగా భారత్ యుద్ధ ప్రాతిపదికన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సీవోఈకి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) సిబ్బంది.. కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ (సీవోఈ) ఆదేశాలతో పనులు ప్రారంభించింది. ఇప్పటికే ఆధునిక భారీ యంత్రాలు అక్కడి చేరుకున్నాయని తెలిసింది.