పనీర్ తింటే బరువు తగ్గుతారా? లేదా పెరుగుతారా?

మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (14:47 IST)
సాధారణంగా పనీర్ తింటే బరువు పెరుగుతామని అందరూ అనుకుంటారు కానీ అది కేవలం అపోహ మాత్రమే. పనీర్ వల్ల బరువు తగ్గుతారు. ఇందులోని పోషకాల వల్ల ఆకలి త్వరగా వేయదు. తద్వారా తీసుకునే ఆహారం మితంగా తీసుకుంటారు. ఇప్పడు పనీర్ వల్ల మరిన్ని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందా.
 
*పనీరులో ప్రొటీన్లు బాగా ఎక్కువ.
 
*గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. 
 
*జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. 
 
*పనీర్ వల్ల బరువు తగ్గుతాం. దీనిలోని పోషకాల వల్ల ఆకలి తొందరగా వేయదు. 
 
*దంతక్షయం నుంచి కాపాడుతుంది. 
 
*మధుమేహం బారిన పడకుండా నిరోధిస్తుంది.
 
*దీన్ని తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. 
 
*బ్లడ్‌‌‌‌‌షుగర్ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తుంది. 
 
*పనీర్‌‌‌‌లో ఫోలేట్ పుష్కలం. ఫోలేట్ బికాంప్లెక్ విటమిన్. ఇది గర్భిణీలకు ఎంతో ముఖ్యం. గర్భంలోని పిండాభివృద్ధికి ఇది సహకరిస్తుంది. 
 
*పనీర్‌‌‌లో విటమిన్-డి. కాల్షియంలు ఎక్కువ. ఇవి రొమ్ము క్యాన్సర్‌‌‌ని నిరోధిస్తుంది. 
 
*యాంగ్జయిటీని నియంత్రిస్తుంది. స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది. 
 
*పనీర్‌‌‌లోని ఫొలేట్ ఎర్రరక్తకణాలను అధికంగా ఉత్ఫత్తి చేస్తుంది.
 
*పనీర్ శరీరానికి వెంటనే ఎనర్జీని అందిస్తుంది.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నుదురు ఆకృతిని బట్టి బొట్టు... అప్పుడే అందంగా...