Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నుదురు ఆకృతిని బట్టి బొట్టు... అప్పుడే అందంగా...

నుదురు ఆకృతిని బట్టి బొట్టు... అప్పుడే అందంగా...
, మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (13:37 IST)
మహిళలను చూసిన వెంటనే అందరి దృష్టినీ ఆకర్షించేది వారు కట్టుకున్నచీరతోనో నగలతోనో కాదు నుదుటి మీద వుండే బొట్టుతో. ఆడవారి ముఖం అందంగా ఆకర్షణగా కనిపించడానికి ప్రధాన కారణం కళ్ళకు పెట్టుకునే కాటుక, నుదుటి మీద వుండే తిలకం బొట్టు. ముఖం ఆకృతిని బట్టి ఎవరు ఏవిధమైన బొట్టు పెట్టుకుంటే అందంగా వుంటుందో తెలుసుకొని ఆవిధంగా పెట్టుకుంటే ముఖ సౌందర్యం ఉన్నదాని కంటే రెట్టింపు అవుతుంది.
 
శరీరం రంగు, ధరించే దుస్తులను బట్టి ఎలాంటి బొట్టు పెట్టుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి. నుదురు ఆకృతిని బట్టి కూడా ఏ బొట్టు నప్పుతుందో చూసుకోవాలి. అలాగే నుదురు చిన్నగా ఉంటే కొంచెం పొడవుగా వుండే బొట్టు పెట్టుకోవాలి. నుదురు వెడల్పుగా వుంటే గుండ్రని బొట్టు మరింత అందాన్నిస్తుంది. నుదురు పెద్దగా ఉండేవారు బొట్టును కనుబొమల మధ్య కాకుండా కొంచెం పైకి పెట్టుకుంటే అందంగా ఆకర్షణీయగా ఉంటుంది.
 
అలాగే శరీరా ఆకృతిని, శరీర ఛాయను బట్టి కూడా బొట్టును సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడే ముఖం మరింత అందంగా కళగా కనిపిస్తుంది. చామనఛాయ లేదా అంతకన్న కాస్తరంగు తక్కువగా ఉన్నవారైతే ఆరెంజ్, పింక్, ఎరుపు రంగు బొట్టు కళగా ఉంటుంది. తెల్లని శరీరఛాయ గలిగిన వారికి ముదురురంగు బొట్టు ఆకర్షణీయంగా ఉంటుంది. 
 
కళ్ళు పెద్దవిగా ఉంటే పెద్ద బొట్టు, చిన్నగా ఉంటే కొంచెం చిన్నసైజు బొట్టు పెట్టుకుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. కళ్ళు చిన్నగా ఉన్నవాళ్ళకి రకరకాల ఆకృతులు, మ్యాచింగ్ రంగుల బొట్టు పెట్టుకున్నా బావుంటుంది. కానీ మధ్యవయస్సు వారికి ఎరుపు, పింక్ వంటి రంగులు పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. చిన్నవయుస్సు వారికి ఎలాంటి బొట్టుపెట్టుకున్ననప్పుతుంది. ఇకపోతే మధ్యవయస్సు వారికి గుండ్రటి బొట్టులు మాత్రమే బాగుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్వరం.. జలుబు... తలనొప్పికి హోమియోపతి చిట్కాలు