Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖం డల్‌గా కాంతి హీనంగా ఉందా?

Advertiesment
Beauty tips
, శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (22:58 IST)
ఆకర్షణీయమైన ముఖం కోసం నానా తంటాలు పడుతున్నారు. అలాంటివారు ఈ క్రింది ఆరు సూత్రాలు పాటిస్తే ఆకర్షణీయమైన ముఖం మీ సొంతం. అవేంటో చూడండి. 
 
ముఖం డల్‌గా కాంతి హీనంగా ఉందా? చిన్నచిన్న చిట్కాలతో మళ్లీ చర్మానికి కాంతి చేకూర్చండి. మీ చేతి వ్రేళ్లతో మీ చర్మానికి జీవకళ తీసుకురావచ్చు, కంటిపై ఎముకభాగం నుండి ముక్కు వరకు అక్కడి నుండి బుగ్గల ఎముక భాగాల వరకు మీ చేతి వ్రేళ్లతో పైకి కిందకు నెమ్మదిగా మర్దనా చేయండి.
 
పైన చెప్పిన విధంగా మర్దనా చేస్తూ మాయిశ్చరైజర్‌ను ముఖానికి పట్టించి మెడ కింది భాగం నుండి గడ్డం వరకు వ్రేళ్లతో మర్దనా చేయాలి, ఇలా చేయడంతో మీ ముఖం కందినట్లు కనిపించినా, ముఖానికి కావలసినంత ఆక్సిజన్ లభిస్తుంది.
 
నిద్రించేప్పుడు ముఖం వైపు పైకి ఉండేలా నిద్రించండి. పక్కకు మరియు బోర్లా పడుకునే వారికి ఎక్కువగా చర్మంపై ముడతలు త్వరగా ఏర్పడుతాయి.
 
మీరు మసాజ్ సెంటర్లకు వెళ్లనక్కర్లేదు, ప్రతీ రాత్రి మీకు నచ్చిన మాయిశ్చరైజర్‌తో ఐదు నిమిషాల పాటు ముఖంపై నెమ్మదిగా మర్దనా చేయండి. మసాజ్ చేయించుకున్నంత ఫలితం పొందుతారు.  
 
పరిశుభ్రమైన ఆహారంతో మీ చర్మానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. మీరు తీసుకునే ఆహారంతో మీ ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. తరచుగా చేపలతో కూడిన ఆహరం తీసుకోవడం వల్ల చర్మానికి మంచి పోషణ అందించవచ్చు.
  
కుడి చేయివాటం ఉన్న వారు ఎక్కువగా సన్‌స్క్రీన్‌ లను ఎడమ వైపు పెడుతారని, ఎడమ చేయివాటం వారు కుడి వైపు ఎక్కువ క్రీం పూస్తారని దీంతో ముఖంపై రెండు వైపులా అసమతౌల్యంగా రాయడం జరుగుతుంది. క్రీం వాడేప్పుడు రెండు వైపులా రెండు చేతులతో మార్చి మార్చి రాయడంతో ముఖమంతా సమపాళ్లలో క్రీం పడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి రోజూ ఉదయం ఐదు నుంచి ఆరు తులసి ఆకులు నమిలితే...