Publish Date: Thu, 19 Dec 2019 (22:35 IST)
Updated Date: Thu, 19 Dec 2019 (22:37 IST)
ఆరోగ్యం కాపాడుకునేందుకు బాదం పప్పులు ఎంతగానో సాయపడతాయి. బాదం నూనె సేవించడం వలన కలిగే లాభాలేంటో ఓసారి తెలుసుకుందాం.
1. బాదం నూనెను నియమానుసారం సేవిస్తుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండెకు చాలా లాభం చేకూరుతుంది.
2. బాదం సేవిస్తుంటే మెదడుకు, నరాల బలహీనతకు బలాన్ని చేకూరుస్తుందంటున్నారు వైద్యులు.
3. బాదం నూనెను తీసుకుంటే మలబద్దకం మటుమాయమౌతుంది. అలాగే శరీరానికి బలం చేకూరుతుంది.
4. కుటుంబమంతటికి కూడా ఇది ఆదర్శవంతమైన టానిక్‌లా బాదం నూనెను వాడొచ్చు. ఆహారానికి రంగు, రుచి వచ్చేలా దీనిని (ఫుడ్ ఎడిటివ్) వాడొచ్చంటున్నారు వైద్యులు.