Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెమ‌ట బాగా ప‌డుతుందా అయితే.. ఈ చిట్కాల‌ను పాటించండి

Advertiesment
Excessive Sweating
చాలా మందికి కాలాలతో సంబంధం లేకుండా చెమట పడుతుంది. చివరకు ఏసీల్లో కూర్చొన్నాసరే చెమట పడుతుంది. దీంతో ఏం చేయాలో తెలియ‌క చాలా మంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అయితే ఎక్కువ‌గా విడుద‌ల‌య్యే చెమట నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. 
 
* గోధుమ గడ్డి జ్యూస్ తాగడం లేదా పోటాషియం ఎక్కువగా ఉండే అరటి పండ్లు తదితర ఆహారాలను తినడం వలన చెమట ఎక్కువగా పట్టకుండా చూసుకోవచ్చు.
 
* ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు రెండు టీస్పూన్ల వెనిగ‌ర్‌, ఒక టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ల‌ను క‌లిపి తాగితే చెమ‌ట ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది. 
 
* కార్న్ స్టార్చ్‌, బేకింగ్ సోడాల‌ను కొద్ది కొద్దిగా తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. చంకల్లో ఎలాంటి త‌డి లేకుండా చూసుకుని ఆ మిశ్ర‌మాన్ని రాయాలి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంత‌రం నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చెమ‌ట ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది. 
 
అలాగే, గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది. ప్రతి రోజూ ఏదైనా ఒక సమయంలో ఒక గ్లాసు టమాటా జ్యూస్‌ను తాగినా చెమట పట్టకుండా చూసుకోవచ్చు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో మెంతులతో ఎన్ని ఉపయోగాలో?