స్త్రీ గర్భాశయం జామకాయంత సైజులో వుంటుంది. గర్భిణీ సమయంలో అది 30 సెంటీమీటర్లు సాగుతుంది. ముడుచుకుని వున్న పురుషుల ఎపిడిడైమస్ విప్పితే ఆరు మీటర్లు వుంటుంది. పుట్టినప్పుడు ఆడపిల్ల అండాశయంలో కొన్నివేల అపక్వ అండాలు వుంటాయి. వీటిలో కొన్ని మాత్రం ఆమె జీవిత కాలంలో బహిష్టు సమయంలో విడుదల అవుతూ వుంటాయి.
పురుషుల శరీరం బయటనే వృషణాశయంలో వృషణాలు వుంటాయి. దీనికి కారణం వీర్యోత్పత్తికి చల్లటి వాతావరణం అవసరం. తల్లి అండంలోనూ తండ్రి వీర్యంకణంలోనూ 23 డిఎన్ఏ, క్రోమోజోములు వుంటాయి. వీటి కేంద్రకంలో ఆయా మాతాపితల అనువంశిక ముద్రలు గుర్తించి వుంటాయి.
పక్వమైన వీర్యకణం పొడవు మిల్లీమీటరులో 20వ వంతు వుంటుంది. స్త్రీ సంపర్కంలో ఒకసారి విడుదలయిన వేల లక్షల వీర్య కణాలలో ఒక్కటి మాత్రమే ఆ స్త్రీ అండంతో కలిసి ఫలదీకరణకు దారితీస్తుంది. ఆడ, మగ నిర్థారించేది పురుష క్రోమోజోములే తప్ప ఇందులో స్త్రీ పాత్ర ఏమీ వుండదు.