అతిగా మొబైల్ వాడుతున్నారా? అయితే క్యాన్సర్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఈ రోజుల్లో ప్రజలు రోజంతా మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌పై నిమగ్నమై ఉంటున్నారు. మొబైల్ వ్యసనం కాలక్రమేణా మన సంతోషాన్ని దూరం చేస్తుంది.
అయితే మొబైల్ ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎక్కువసేపు మొబైల్‌ని ఉపయోగించడం వల్ల ఫోన్ నుంసీ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ వెలువడుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. ఎక్కువ మొబైల్స్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని పలు అధ్యయనాల్లో తేలింది.
అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో ఎక్కువ ఒత్తిడికి గురవ్వడం క్యాన్సర్ అవకాశాలను పెంచుతుంది.
ఎక్కువ ఒత్తిడికి లోనయ్యే వారి రక్తపోటు పెరుగుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
ధూమపానం, మద్యం తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రోజంతా ఎక్కువ సేపు కూర్చోవడం ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.