Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Neocov Variant Fact Check: ఇది ప్రతి ముగ్గురిలో ఒకరిని చంపుతుందా?

Advertiesment
Neocov Variant Fact Check: ఇది ప్రతి ముగ్గురిలో ఒకరిని చంపుతుందా?
, శనివారం, 29 జనవరి 2022 (21:17 IST)
కరోనా వైరస్ వచ్చిన దగ్గర్నుంచి వివిధ వేరియంట్ల రూపంలో ప్రజలపై విరుచుకుపడుతూనే వుంది. ఈ నేపధ్యంలో 
నియోకోవ్ వేరియంట్ అనేది ప్రజలపై విరుచుకుపడుతుందని చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు బాంబు లాంటి వార్తను తెలిపారు.


దక్షిణాఫ్రికాలో కనుగొనబడిన నియో-కోవ్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది చాలా ప్రాణాంతకమని చెప్పారు. టైమ్స్ నౌలోని ఒక నివేదిక ప్రకారం, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్- వుహాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నియోకోవ్ వేరియంట్ కొత్తది కాదని కనుగొన్నారు. ఈ వేరియంట్ SARS కోవ్-2కి సంబంధించినదిగా చెప్పబడింది.

 
ఇది మొట్టమొదట దక్షిణాఫ్రికాలో గబ్బిలాలలో కనుగొనబడింది. ఈ వేరియంట్ ఇప్పటికీ జంతువులలో ప్రబలంగా ఉంది. ఈ రూపాంతరం కరోనా వైరస్‌కు సంబంధించినది అయినప్పటికీ, నియోకోవ్ ప్రస్తుతం మానవులకు సోకడం లేదని పరిశోధనలు సూచిస్తున్నాయి. కాకపోతే, వైరస్‌లో ఏవైనా కొత్త మార్పులు వస్తే మాత్రం అది మానవులకు ప్రాణాంతకం కావచ్చు. నియోకోవ్‌ని మెర్స్ కరోనా వైరస్‌కు సంబంధించినదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

 
ఇది జలుబు నుండి అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వరకు మానవులలో వ్యాధులను కలిగిస్తుంది. కాగా ఇప్పటివరకు ఈ పరిశోధనా పత్రాన్ని ఇతర శాస్త్రవేత్తలు సమీక్షించలేదు. ఇది ప్రాథమిక సమాచారం ఆధారంగా మాత్రమే ప్రచురించబడింది. వైరస్ మానవులకు వ్యాపిస్తే, గతంలో ఇన్ఫెక్షన్ నుండి తయారైన వ్యాక్సిన్ లేదా యాంటీబాడీస్ నుండి తప్పించుకోవచ్చని చెప్పారు. నియోకోవ్ మెర్స్, సార్స్ కోవ్-2కి దగ్గరగా ఉంది.

 
అందుకే ఇది ప్రస్తుత కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తుంది. మెర్స్ కోవ్ నుండి మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నియోకోవ్‌ను సూచించారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కొత్త వేరియంట్ గురించి ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఏదైనా కొత్త వేరియంట్ లేదా మ్యుటేషన్ గురించి సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తుంటుంది. కనుక ఇప్పటికైతే నియోకోవ్ భయం లేదన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగులపై జగన్ సర్కార్ ఎస్మా చట్టం ప్రయోగిస్తుందా? అప్పటి తమిళనాడు సీఎం జయలలిత అలా చేస్తే...