Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆయుర్వేదంతో కోవిడ్ పరార్.. చిట్కాలు ఇవే.. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ

Advertiesment
ఆయుర్వేదంతో కోవిడ్ పరార్.. చిట్కాలు ఇవే.. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ
, గురువారం, 5 నవంబరు 2020 (11:24 IST)
ప్రపంచ దేశాలకు కరోనా చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ద్వారా కోవిడ్‌ను సమర్థంగా కట్టడి చేయవచ్చని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కోవిడ్ నుంచి తప్పించుకునేందుకు ఆయుర్వేద వైద్యం ఉపయోగపడుతుందని, వంటింటి చిట్కాలతోనూ ఎనలేని మేలు జరుగుతుందని తెలిపింది. 
 
కరోనా సహా కాలానుగుణ వ్యాధులను అరికట్టడానికి ఆయుర్వేద విధానాలు అనుసరించాలని సూచించింది. ముఖానికి మాస్కులు ధరించడం, ఆరు అడుగుల వ్యక్తిగత దూరాన్ని పాటించడం, వస్తువును కానీ, వ్యక్తిని కానీ తాకిన వెంటనే చేతులను సబ్బుతో లేదా శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవడం తదితర ముందస్తు జాగ్రత్తలు పాటించడంతో పాటు ఆయుర్వేద వైద్యాన్ని అనుసరించడం ద్వారా కోవిడ్‌ను తరిమికొట్టవచ్చు. 
 
ఈ క్రమంలో ఆయుర్వేద చిట్కాలను పాటించాలని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు వెల్లడించింది. అవేంటంటే..?
 
రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం కోసం ఉదయాన్నే 10 గ్రాముల చ్యవన్‌ప్రాష్‌ తీసుకోవాలి. మధుమేహులైతే తీపి లేని చ్యవన్‌ప్రాష్‌ను స్వీకరించాలి.
పసుపు, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి వంటివాటిని వంటల్లో తప్పనిసరిగా వినియోగించాలి.
పొడి దగ్గు ఉంటే తాజా పుదీనా ఆకులు వేడి నీటిలో వేసుకొని ఆవిరి పీల్చాలి.
 
గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటుగా చేసుకోవాలి. తద్వారా శ్వాసకోశ సమస్యలను నివారించవచ్చు.
నిత్యం యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటివి చేయాలి.
 
దగ్గు, గొంతులో చికాకు ఉంటే బెల్లం లేదా తేనెలో కలిపిన లవంగం పొడిని రోజుకు రెండు మూడు పర్యాయాలు స్వీకరించాలి.
కొంచెం నువ్వులు లేదా కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని 2, 3 నిమిషాలు పుక్కిలించి ఉమ్మివేయాలి. అనంతరం గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.
 
ఆయుష్‌ క్వాత్, సంషమణివతి, అశ్వగంధ తదితర ఔషధాలను ఆయుర్వేద వైద్యుల సూచనల మేరకు తగు మోతాదులో వాడాలి.
తులసి, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, పొడి అల్లం, ఎండు ద్రాక్ష తదితరాలతో కషాయాన్ని తయారు చేసి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. రుచి 
ధూమపానం, మద్యపానం అలవాట్లను మానుకోవాలి. గోరు వెచ్చని నీటిలో తగినంత పసుపు వేసి రోజూ ఉదయం, సాయంత్రం తాగాలి.  
 
కావాలనుకుంటే.. నిమ్మరసం, బెల్లం కలపవచ్చు.
సులువుగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెదడుకు హాని కలిగించే అలవాట్లు ఏవి?