Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేకప్ చెదిరిపోకుండా ఉండాలంటే..?

Advertiesment
makeup
కొందరైతే మేకప్ తెగ వేసుకుంటారు. కానీ, అది ఓ 5 నిమిషాలు కూడా ఉండదు.. వెంటనే చెదిరిపోతుంది. మరికొందరికి మేకప్ అంటే అస్సలు నచ్చదు. అయినా కూడా వేసుకుంటారు. అయితే వారికి మాత్రం మేకప్ చెదిరిపోకుండా అలానే ఉంటుంది. ఎప్పుడూ మేకప్ వేసుకునే వారికి మాత్రం చెదిరిపోతూనే ఉంటుంది. అలాంటివారికి ఈ కింది తెలిపినవి పాటిస్తే చాలు. 
 
1. మాయిశ్చరైజ్ ముఖానికి రాసుకున్న తరువాత 10 నిమిషాలకు ఫౌండేషన్ అప్లయ్ చేయాలి. 
 
2. కాంపాక్ట్ వాడితే ఫౌండేషన్ బాగా సెట్ అవుతుంది. రోజంతా కాంపాక్ట్ పౌడర్‌ని టచ్ చేసుకుంటూ ఉండేందుకు వీలుగా వెంట వుంచుకోవచ్చు. 
 
3. మేకప్ చెదిరిపోవడం ఆరంభించాక మరకలు ఏర్పడకుండా ఉండేందుకు తేలిక రంగు ఫౌండేషన్‌ను, నిండు రంగు పౌడర్‌ను ఉపయోగించాలి.
 
4. పేపర్ టవల్‌తో మధ్య మధ్యలో అద్దుకుంటూ ఉంటే చర్మంపై గల అదనపు నూనెను పీల్చేస్తుంది.
 
5. ఫౌండేషన్, పౌడర్‌ల బేస్ కోట్‌లు ఐ షాడోను కూడా ఎక్కువసేపు కాపాడగలవు. పెదవులకు కొద్దిగా ఫౌండేషన్ అప్లయ్ చేస్తే లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది. తర్వాత బుగ్గలకు బ్లష్ చేసుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొప్పాయిని తేనెతో పాటు తింటే...?