Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందంగా ఉండాలంటే అవసరమైనవి ఏమిటి..?

Advertiesment
అందంగా ఉండాలంటే అవసరమైనవి ఏమిటి..?
, బుధవారం, 30 జనవరి 2019 (14:10 IST)
అందంగా ఉండాలంటే అవసరమైనవి ఏమిటి..? ఆరోగ్యం. ఆరోగ్యం సరిగా లేనప్పుడు అందంకోసం ఎన్ని పైపూతలు చేసినా ప్రయోజనం లేదు. ఆరోగ్యశాస్త్ర విషయపై అవగాహన కలిగి ఉండడమే అందానికి అసలైన పునాది. అందంగా ఉండాలంటే.. ఈ ఐదు సూత్రాలు పాటించాలి..
 
1. శుభ్రత: అందానికి మొదటి మెట్టు శుభ్రత. శరీరంలోనూ, బయటా శుభ్రత ఉండాలి. అజీర్ణం లేకుండా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. 
 
2. నోటి ఆరోగ్యం: దంతాల శుభ్రత, నోటి దుర్వాసన లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నడక చాలా అవసరం. నడకతోపాటు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచిది. 
 
3. బేలన్స్‌డ్ డైట్: పోషకాహార విలువలు కలిగిన నియమితాహారం అందానికి ఓ సూత్రం. శరీరం లోపలి భాగాలకు శుభ్రతనీ, పుష్టినీ ఇచ్చే కూరగాయలు, పండ్లు, వెన్న తీసిన మజ్జిగ వంటివి. జీర్ణకారకమైన పదార్థాలు తీసుకుంటే శరీరానికి నునువూ, మెరుపూ, లావణ్యం వస్తాయి. 
 
4. మెడికల్ చెకప్స్: రెగ్యులర్‌గా మెడికల్ చెకప్స్ చేయించుకుని అనారోగ్యం లేకుండా జాగ్రత్త పడాలి. 
 
5. రిలాక్సేషన్: మితిమీరిన పనికాకుండా, నియమితమైన పని అవసరం. ఆందోళనలు, భయాలు వదిలేయాలి. చక్కని సంగీతం, మంచి వినోదం వంటి సాధనాలతో రిలాక్స్ కావాలి. మానసికమైన ప్రశాంతత ముఖానికి కాంతిని, ఆకర్షణని ఇస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భర్త శృంగార పిచ్చోడు... నాకు ఇష్టం లేదు.. ఏం చేయాలి?