Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోము వీర్రాజు ఎంట్రీతో వైసిపి బ్రహ్మాండమైన లాభమా? ఎందుకని?

సోము వీర్రాజు ఎంట్రీతో వైసిపి బ్రహ్మాండమైన లాభమా? ఎందుకని?
, బుధవారం, 29 జులై 2020 (20:11 IST)
భారతీయ జనతాపార్టీ ఎపి అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించారు. ఉన్నట్లుండి బిజెపి అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు కూడా చెప్పకుండా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడం.. దాంతో పాటు సోము వీర్రాజు అందరితోను కలిసిపోయే స్వభావం ఉండటంతో ఆయన నియామకంపై ఎలాంటి విమర్సలు లేకుండా పోయింది.
 
ఎపిలోని బిజెపిలో ఉన్న నేతలందరూ సోమువీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నా ప్రస్తుతం బిజెపిలో జరుగుతున్న మరో ప్రచారం సోము వీర్రాజు వైసిపిలోని కొంతమందికి బాగా దగ్గరగా ఉంటున్నారనీ, అది ఇప్పుడే కాదు వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోము వీర్రాజు విజయసాయిరెడ్డితో బాగానే టచ్‌లో ఉంటున్నారట.
 
టచ్ అంటే పార్టీలోకి వెళ్ళడానికి కాదు.. స్నేహభావంతో ఉంటూ వచ్చారు. వైసిపిలో విజయసాయిరెడ్డి మాత్రమే కాకుండా ఇంకా చాలామంది వైసిపి నేతలతో సన్నిహితంగా ఉన్నారు సోము వీర్రాజు. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షునిగా ఉన్న సమయంలో వైసిపిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు.
 
ప్రజలు ఎక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నా, ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందకపోయినా వెంటనే కన్నా లక్ష్మీనారాయణ స్పందించేవారు. ఘాటుగా విమర్సలు చేసేవారు. ప్రస్తుతం సోమువీర్రాజు బాధ్యతలు చేపట్టిన తరువాత అలాంటిది ఉండే అవకాశమే లేదంటూ బిజెపిలో ప్రచారం జరుగుతోంది. సోము వీర్రాజును అధ్యక్షునిగా నియమించడం వైసిపికి లాభమంటున్న నాయకులు లేకపోలేదు. మరి చూడాలి పార్టీ అధినాయకత్వం తనపై నమ్మకం పెట్టుకుని బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేరుస్తారా లేదా అన్నది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగస్టు 31 వరకు లాక్డౌన్ పొడగింపు : అన్‌లాక్ 3.O మార్గదర్శకాలు ఇవే...