Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

Advertiesment
crime

ఠాగూర్

, ఆదివారం, 30 మార్చి 2025 (14:15 IST)
గుంటూరు జిల్లా కేంద్రంలోని ఫిరంగిపురంలో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులపై సవతితల్లి కర్క
శత్వం ప్రదర్శించింది. కార్తీక్ అనే బాలుడుని మారుతల్లి లక్ష్మీ అనే మహిళ గోడకేసి కొట్టి చంపేసింది. అలాగే, మరో బాలుడుకి అట్లపెనంతో వాతలు పెట్టింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ వాతలను భరించలేని ఆ బాలుడు కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో పోలీసులు అక్కడకు వచ్చి బాలుడుని రక్షించారు. మరణించిన బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, భార్య చనిపోవడంతో ఆ చిన్నారుల తండ్రి సాగర్ ఆ మహిళతో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. 
 
వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి బావిలో దూకిన వ్యక్తి.. తర్వాత ఏమైంది? 
 
వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి నేలబావిలో దూకేశాడు. ఆ బావికి మెట్లు లేకపోవడంతో పాటు అది నిర్మానుష్య ప్రాంతంలో ఉండటంతో మూడు రోజులు పాటు అందులోనే ఉండిపోయాడు. చివరకు ఆడుకునేందుకు ఆ బావి వద్దకు వచ్చిన కొందరు పిల్లలు ఆ వ్యక్తిని గుర్తించి గ్రామస్థులు, పోలీసుల సాయంతో రక్షించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
32 యేళ్ల సందీప్ శర్మ అనే వ్యక్తి పిశోర్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే, బంధువుల గ్రామానికి చేరుకోగానే అతడిని కుక్కలు వెంబడించాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో భయంతో పరుగులు తీసిన సందీప్ నిర్మానుష్యంగా ఉన్న నేల బావిలో దూకేశాడు. లోతైన ఆ బావినుంచి ఎంత అరిచినా అతడి కేకలు ఎవరికీ వినిపించలేదు. 
 
దీంతో మూడు రోజుల పాటు అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఆ బావి వద్దకు వెల్లారు. ఆ సమయంలో సందీప్ వారికి కనిపించాడు. దాంతో వెంటనే వెళ్లి గ్రామస్థులకు విషయం చెప్పారు. వారు పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పొడవాటి తాడుకు ఓ టైరు కట్టి బావిలోకి వదిలారు. దాని సాయంతో సందీప్‌‍ను బయటకు తీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!