Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థినిపై బ్లడ్ బ్యాంకు ఉద్యోగి లైంగిక వేధింపులు

Advertiesment
victim woman
గుంటూరు ప్రభుత్వ సాధారణ వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమో కోర్చు చేస్తున్న కొందరు విద్యార్థినుల శిక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకులో పని చేసే ఓ ఉద్యోగి వారిపట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
బ్లడ్ బ్యాంకు ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేశాడని బాధిత విద్యార్థినులు గుంటూరు వైద్యకళాశాల ప్రిన్సిపాల్ సుందరాచారికి ఫిర్యాదు చేశారు. అయిన వెంటనే స్పందించి ముగ్గురు అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా సదరు బ్లడ్ బ్యాంకు ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకోనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెనాలిలో కాకినాడ యువకుడి కిడ్నాప్ - కరెంట్ షాక్‌తో చిత్రహింసలు