Publish Date: Sun, 21 Dec 2025 (12:40 IST)
Updated Date: Sun, 21 Dec 2025 (12:42 IST)
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘట జరిగింది. హైదరాబాద్ నగరాన్ని ఆక్రమించుకుని గృహాలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకున్న వారికి నిద్రలేకుండా చేస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ కృష్ణచైతన్య బలవన్మరణ యత్నానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్‌లోని ఇంట్లో తుపాకీతో పేల్చుకున్నారు. కృష్ణ చైతన్యను కుటుంబ సభ్యులు ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణచైతన్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.