Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

Advertiesment
Tanikella Bharani,  C.H. Rama Rao, Krishna Chaitanya, damodaraprasad

దేవి

, శనివారం, 6 డిశెంబరు 2025 (18:39 IST)
Tanikella Bharani, C.H. Rama Rao, Krishna Chaitanya, damodaraprasad
ఘంటసాల వేంకటేశ్వరరావు (ఘంటసాల) బయోపిక్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కింది. సి.హెచ్. రామారావు దర్శకత్వంలో ‘ఘంటసాల ది గ్రేట్’ అనే టైటిల్‌తో డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మాణ సారథ్యంలో సి.హెచ్. రామారావు రచన, దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య పాత్రను పోషించారు.
 
ఈ నేపథ్యంలో  హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఘంటసాల బయోపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈ వేదికపై ఘంటసాల గొప్పతనాన్ని, తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసింది ఘంటసాల బయోపిక్ చిత్ర యూనిట్. 
 
 ఈ చిత్రంలో ఘంటసాల పాత్ర పోషించిన కృష్ణ చైతన్య మాట్లాడుతూ..  నేను సింగర్‌ని, యాక్టర్‌ని కాదు. ఘంటసాల పాటలు వింటూ పెరిగిన నాకు ఈ సినిమాలో నటించే అదృష్టం దక్కడం ఒక వరం. పాటలు పాడుకునే నన్ను రామారావు గారు పట్టుబట్టి ఈ రోల్ చేయించారు. ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. వీరందరికీ థ్యాంక్స్. తెలుగు సినిమా సంగీతానికి రెండు కళ్ళలో ఒకటి గంటసాల గారు అయితే రెండోది బాలసుబ్రమణ్యం గారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కూడా మూడేళ్ళ క్రితం ఆయన చేతుల మీదుగానే జరిగింది. అది కూడా నా అదృష్టం. వాళ్ళందరి ఆశీర్వాదం ఈ సినిమాపై, నాపై ఉండటం నా అదృష్టం.  డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా చూసి మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్న'' అని అన్నారు.
 
 ఘంటసాల బయోపిక్ దర్శకుడు సి.హెచ్. రామారావు మాట్లాడుతూ.. ''మహాగాయకుడు ఘంటసాల గారి గురించి ఇప్పటి తరానికి తెలియాలనే తపనతో ఎంతో కష్టపడి ఈ సినిమా తీసాం. ఇంత గొప్ప సినిమా తీశాను అని సంతృప్తిగా ఉంది. ఈ సినిమా ప్రివ్యూ చూసి సినీ ప్రముఖులు అభినందిస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. భారతదేశ చరిత్రలోనే ఒక గాయకుడి బయోపిక్ రావడం ఇదే ప్రధమం. ఆ ఖ్యాతి ఘంటసాల గారికి దక్కింది. అది తీసే అదృష్టం నాకు దక్కింది. ఈ సినిమా చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఈ సినిమా ప్రయాణంలో నా వెంట నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అని అన్నారు.  
 
 ఘంటసాల బయోపిక్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత శోభారాణి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇప్పటికే 70కి పైగా చిత్రాలు రిలీజ్ చేసిన నాకు ఈ ఘంటసాల గారి బయోపిక్ రిలీజ్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్న. ఈ చిత్రం శంకరాభరణం లెవెల్ లో వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందుకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను'' అన్నారు. 
 
 ఈ సినిమా నిర్మాత ఫణి మాట్లాడుతూ..'ప్రతి ఒక్కరూ మా సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అందరికీ థాంక్స్' అన్నారు. 
 
 లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ''ఘటసాల బయోపిక్ అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్న. ఈ సినిమాలో ఘంటసాల పాత్ర పోషించే అవకాశం రావడం కృష్ణ చైతన్య అదృష్టం. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'' అన్నారు.
 
 చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా స్పెషల్ షో చూశా. ఇది గొప్ప సినిమా. డిసెంబర్ 12న ఇది మరో శంకరాభరణం కాబోతోంది. ఈ సినిమా తీసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ జన్మ ధన్యం. ఇంత మంచి చిత్రాన్ని తీసిన సి.హెచ్. రామారావుకి మా ప్రొడ్యూసర్స్ అందరి తరఫున ధన్యవాదాలు చెబుతున్నా. ఇందులో హీరోగా చేసిన కృష్ణ చైతన్యతో పాటు అందరు నటీనటులు బాగా చేశారు'' అన్నారు.
 
 రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చదలవాడ శ్రీనివాస్ గారు ముక్కుసూటి మనిషి. ఆయన్నే ఈ సినిమాతో మెప్పించారంటే రియల్లీ గ్రేట్. ఘంటసాల గారు ఓ లెజెండ్. ఆయన బయోపిక్ తీయాలనే ఆలోచన మీకు రావడం నిజంగా గొప్ప విషయం. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నా'' అన్నారు. 
 
 తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ''ఒక మహానుభావుడి సినిమా ఇది. దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మామూలు విషయం కాదు. చదలవాడ శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఇది మరో శంకరాభరణం అవుతుంది'' అన్నారు.
 
 తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఘంటసాల గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. స్నేహంలో గాని, ఆప్యాయతలో గాని ఆయన్ను మించిన వారు లేరు. ఆయన పోయిన రోజు ఎంతో బాధపడ్డాం. సి.హెచ్. రామారావు గారు ఈ సినిమా తీయడం నిజంగా ఓ దైర్యం. ఓ సదుద్దేశంతో సినిమా తీశారు కాబట్టి మీరు ఈ సినిమా కష్టాలు అధిగమించి విజయం సాధిస్తారు అని భావిస్తున్నా'' అన్నారు. 
 
 రచయిత జేకే భారవి మాట్లాడుతూ.. ''సి.హెచ్. రామారావు గారి ప్రతిభ గొప్పది. ఈ సినిమా చూసి తీరాలి. సభాముఖంగా చెబుతున్నా.. ఇది మరో శంకరాభరణం కావాలి, మరో మహానటి కావాలి. ఆ వెంకటేశ్వర స్వామిని చేతులు జోడించి అడుగుతున్నా ఈ సినిమా సక్సెస్ కావాలి'' అని అన్నారు. 
 
ఈ సినిమాకు మొదటి టికెట్ ఒక లక్ష రూపాయలు కేటాయించి చదలవాడ శ్రీనివాస్ కొనడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్