Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

50 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోవడమా.. జీర్ణించుకోలేనిది : రోహిత్ శర్మ

Advertiesment
rohith sharma

వరుణ్

, సోమవారం, 5 ఆగస్టు 2024 (10:36 IST)
కేవల 50 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోవడం జీర్ణించుకోలేనిది అంటూ భారత క్రికెట్ జట్టు కెప్టన్ రోహిత్ శర్మ అన్నారు. వన్డే సిరీస్‌లో భాగంగా, ఆదివారం ఆతిథ్య శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముఖ్యంగా 50 పరుగుల తేడాతో ఆరు ప్రధాన వికెట్లను భారత్ కోల్పోయింది. దీనిపై మాజీ క్రికెటర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఓటమిపై భారత కెప్టెన్ విచారం వ్యక్తం చేశాడు. ఈ పరాజయం బాధ కలిగిస్తోందని అన్నాడు. 
 
మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు ఏవిధంగా ఆదారనే దానిపై తాము చర్చించుకుంటామని చెప్పాడు. ఒక మ్యాచ్ ఓడిపోతే అన్ని విషయాలు బాధ కలిగిస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించాడు. భారత్ 50 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయిన ఆ 10 ఓవర్ల గురించే తాను మాట్లాడడం లేదని, అన్ని అంశాలు చర్చించుకుంటామని పేర్కొన్నాడు. నిలకడగా క్రికెట్ ఆడాలని, అయితే ఆ విషయంలో తాము విఫలమయ్యామని అభిప్రాయపడ్డాడు. ఈ ఓటమితో కొంచెం నిరాశ చెందామని, అయితే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని వ్యాఖ్యానించాడు.
 
రెండో వన్డేలో తాము తగినంతగా రాణించలేకపోయామని, మిడిల్ ఓవర్లలో తమ బ్యాటింగ్ వైఫల్యంపై చర్చిస్తామని రోహిత్ చెప్పాడు. భారత బ్యాటర్లు ఇక్కడి పిచ్‌లకు త్వరగా అలవాటుపడాల్సిన అవసరం ఉందన్నాడు. ఇక్కడి పిచ్‌లకు అనుగుణంగా మారాలని, లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌తో సులభంగా బ్యాటింగ్ చేయవచ్చునని తాము భావించామని, అయితే లంక స్పిన్నర్ జెఫ్రీకి ఘనత దక్కుతుందని, అతడు 6 వికెట్లు సాధించి మ్యాచ్‌ను శాసించాడని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
 
ఇక తాను దూకుడుగా బ్యాటింగ్ చేయడంతోనే 65 పరుగులు వచ్చాయని, తాను బ్యాటింగ్ చేసిన విధానమే అందుకు కారణమని రోహిత్ శర్మ చెప్పాడు. అయితే ఇలా బ్యాటింగ్ చేస్తే చాలా నష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఔట్ అయితే తీవ్ర నిరాశ మిగులుతుందని, కానీ రాజీపడకూడదని తాను నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. మ్యాచ్ అనంతర ప్రజెంటేషన్ ఈవెంట్‌లో ఈ మేరకు రోహిత్ శర్మ మాట్లాడాడు.
 
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 240 పరుగులు చేసింది. ఆ తర్వాత 241 పరుగుల లక్ష్య ఛేదనలో 96 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోని జట్టు ఓడిపోతుందని ఎవరు భావిస్తారు. కానీ ఆదివారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు అనూహ్యంగా పరాజయం పాలైంది. 32 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. లంక లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే భారత బ్యాటింగ్ లైనపన్‌ను పేకమేడలా కుప్పకూల్చాడు. ఏకంగా 6 వికెట్లు సాధించాడు. ఫలితంగా భారత్ 208 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో శ్రీలంక 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పారిస్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ బెర్త్‌ ఖాయం-భారత హాకీ అదుర్స్