సచిన్ ట్రోఫిలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా (5/74) ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రాకు డబ్ల్యూటీసీలో ఇది 12వ ఐదు వికెట్ల ఘనత. ఈ క్రమంలో అతను రవిచంద్రన్ అశ్విన్ రికార్డ్‌ను అధిగమించాడు.
రవిచంద్రన్ అశ్విన్ 11 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్‌ను అత్యధికసార్లు ఔట్ చేసిన బౌలర్‌గా కూడా బుమ్రా రికార్డ్ సాధించాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్‌ను అత్యధికసార్లు ఔట్ చేసిన బౌలర్‌గా కూడా బుమ్రా రికార్డ్ సాధించాడు.
ఈ క్రమంలో ప్యాట్ కమిన్స్ రికార్డ్‌ను బుమ్రా అధిగమించాడు. లార్డ్స్ టెస్ట్‌లో సెంచరీతో చెలరేగిన జోరూట్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. టెస్ట్‌ల్లో అతన్ని ఔట్ చేయడం బుమ్రాకు 11వ సారి కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 15వ సారి కావడం గమనార్హం. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 336 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ సమంగా ముగిసింది.