ప్రముఖ నటి, కర్నాటక మాండ్య ఎంపీ సుమలతకు కరోనావైరస్ సోకింది. ఆమెకు దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి వుండటంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించగా రిపోర్టులో పాజిటివ్ అని వచ్చింది. కాగా ఆమె కరోనావైరస్ విజృంభించడంతో తన నియోజకవర్గ ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు ప్రాంతాల్లో తిరిగారు. దీనితో ఆమె కరోనావైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	కాగా ఆమె వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ వున్నారు. దేవుడు దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఈ కరోనా మహమ్మారి నుంచి త్వరలో బయటపడగలనన్న ధీమా వ్యక్తం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించిన సుమలత జీ తెలుగులో ప్రసారమవుతున్న బతుకు జట్కా బండి కార్యక్రమానికి కొన్ని రోజుల పాటు హోస్ట్‌గా వ్యవహరించారు.