Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొండి కర్నాకట ప్రభుత్వం: పరీక్షలు పెట్టింది, విద్యార్థులను కరోనా బారిన పడేసింది

మొండి కర్నాకట ప్రభుత్వం: పరీక్షలు పెట్టింది, విద్యార్థులను కరోనా బారిన పడేసింది
, శనివారం, 4 జులై 2020 (15:22 IST)
ఊరంతటిదీ ఒక దారి అయితే ఉలిపిరి కట్టది మరో దారి అనే సామెత మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సామెత కర్నాటక ప్రభుత్వానికి ఖచ్చితంగా సరిపోతుందని అక్కడి విద్యార్థుల తల్లిదండ్రు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్నవేళ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందర్నీ ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కానీ కర్నాటక ప్రభుత్వం మాత్రం ఇందుకు ససేమిరా అన్నది పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలు జూన్ 25 నుంచి జూలై 3 వరకూ జరిగాయి. ఐతే పరీక్షలు రాసిన వారిలో 32 మంది విద్యార్థులకు కరోనాపాజిటివ్ అని తేలడం ఇప్పుడు ఆందోళకరంగా మారింది.
 
కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, జూన్ 25 మరియు జూలై 3 మధ్య పరీక్షలు రాసినవారిలో 32 మంది ఎస్‌ఎస్‌ఎల్‌సి విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. మరో ఎనభై మంది విద్యార్థులను హోంక్వారెంటైన్లో వుంచారు. ఈ పరీక్షలను 7.60 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 14,745 మంది హాజరు కాలేదు. 3,911 మంది విద్యార్థులు కంటైన్మెంట్ జోన్‌లో ఉన్నందున పరీక్షలకు హాజరు కాలేదని ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అనారోగ్యంతో మొత్తం 863 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు.
 
గత వారం, హసన్ నుండి 10వ తరగతి విద్యార్థికి కరోనావైరస్ పరీక్ష చేశారు. కరోనావైరస్ ఫలితం తేలకుండానే అతడు జూన్ 25న ఒక పరీక్ష రాసినట్లు సమాచారం. మొదటి పరీక్ష రాసిన అనంతరం అతడికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో అతడిని క్వారెంటైనుకి పంపారు.
 
COVID-19 మహమ్మారి కారణంగా అంతకుముందు మార్చి 27 మరియు ఏప్రిల్ 9 మధ్య షెడ్యూల్ చేసిన SSLC పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు జూన్ 25 నుంచి జూలై 3 మధ్య జరుగుతాయని మే నెలలో కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షా హాలులో అందరికీ హ్యాండ్ శానిటైజర్లు అందజేస్తామని, ప్రతిరోజూ తరగతి గదులు శుభ్రపరుస్తామని ప్రభుత్వం తెలిపింది.
 
పరీక్షా హాలులోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికీ ఆరోగ్య శాఖ ద్వారా ఉష్ణోగ్రత తనిఖీలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కర్ణాటక విద్యా విభాగం కంటైన్మెంట్ జోన్ల నుండి విద్యార్థులను మరియు రాష్ట్రంలో COVID-19 లక్షణాలు ఉన్నవారిని ఇతర విద్యార్థుల నుండి ప్రత్యేక గదిలో వారి SSLC పరీక్షలను రాయడానికి అనుమతించింది. లాక్డౌన్ కారణంగా తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్ళిన విద్యార్థులను దగ్గరి కేంద్రం నుండి పరీక్షలు రాయడానికి అనుమతించారు. ఐతే ఇప్పుడు పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 16 మందికి కోరనావైరస్ వున్నట్లు తేలడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీటీడీని వదిలిపెట్టని కరోనా.. సిబ్బందికి మాత్రమే.. భక్తులు సేఫ్